30 నగరాల్లో లెజెండరీ హీరో దేవానంద్ సినిమాల ప్రదర్శన
సెప్టెంబర్ 26న దేవ్ ఆనంద్ 100వ జయంతి సందర్భంగా ''దేవ్ ఆనంద్@100 - ఫరెవర్ యంగ్'' పేరుతో టైమ్‌లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఐకాన్‌కు నివాళులర్పిస్తుంది.
By: Tupaki Desk | 12 Sep 2023 4:45 AM GMTఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ దేవ్ ఆనంద్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రకటించింది. 30 భారతీయ నగరాల్లో లెజెండరీ నటుడి సినిమాలను ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేసింది. ఎన్‌ఎఫ్‌డిసి-ఎన్‌ఎఫ్‌ఎఐ- పివిఆర్ ఐనాక్స్ సంయుక్తంగా నిర్వహించే రెండు రోజుల వారాంతపు వేడుకలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 26న దేవ్ ఆనంద్ 100వ జయంతి సందర్భంగా ''దేవ్ ఆనంద్@100 - ఫరెవర్ యంగ్'' పేరుతో టైమ్‌లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఐకాన్‌కు నివాళులర్పిస్తుంది. ఎన్‌ఎఫ్‌డిసి-ఎన్‌ఎఫ్‌ఎఐ (నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా) - పివిఆర్ ఐనాక్స్ సంయుక్తంగా రెండు రోజుల వారాంతపు వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నాయి. సెప్టెంబర్ 23, 24 తేదీలలో 30 నగరాలు 55 సినిమా హాళ్లలో ఈ వేడుకల్ని నిర్వహిస్తారు.
ప్రముఖ ఫిలింమేకర్ ఆర్కైవిస్ట్ శివేంద్ర సింగ్ దుంగార్‌పూర్ స్థాపించిన లాభాపేక్షలేని సంస్థ రొమాంటిక్ హీరో దేవ్ ఆనంద్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలను సేకరించింది. ముంబై, పూణే, గోవా, అహ్మదాబాద్, హైదరాబాద్, త్రివేండ్రం, చెన్నై, బెంగళూరు, లక్నో, కోల్‌కతా, గౌహతి, ఇండోర్, జైపూర్, నాగ్‌పూర్, చండీగఢ్, న్యూఢిల్లీ, గ్వాలియర్, రూర్కెలా, రాయ్‌పూర్, నోయిడా, కొచ్చి, ఔరంగాబాద్, వడోదర, సూరత్‌లోని ప్రేక్షకులకు థియేటర్లలో ఈ సినిమాలు అందుబాటులోకి రానున్నాయి. ఇతర నగరాల్లోని మొహాలీ పెద్ద స్క్రీన్‌పై (NFCDC-NFAI రీక్రియేట్ చేసిన స్క్రీన్) ఈ మైలురాయి చిత్రాలను వీక్షించే అవకాశం కూడా ఉంది. సిఐడి (1956), గైడ్ (1965), జ్యువెల్ థీఫ్ (1967), జానీ మేరా నామ్ ( 1970) లాంటి క్లాసిక్ చిత్రాలను దేవానంద్ అభిమానులు థియేటర్లలో వీక్షించే సౌలభ్యం ఉంది.
ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ అధినేత, ఫిలింమేకర్ శివేంద్ర సింగ్ దుంగార్‌పూర్ మాట్లాడుతూ-''అమితాబ్ బచ్చన్ 80వ పుట్టినరోజును .. దిలీప్ కుమార్ శతాబ్దిని స్మరించుకోవడానికి ఉత్సవాలు నిర్వహించాం. బచ్చన్ బ్యాక్ టు ది బిగినింగ్ -దిలీప్ కుమార్ హీరో ఆఫ్ హీరోస్ విజయవంతమైన తర్వాత, దేవ్ ఆనంద్ జయంతి వేడుకలు జరుపుకోవాలనుకున్నాం. లెజెండరీ నటుడి మైలురాయిగా ఉన్న నాలుగు చిత్రాలను ప్రదర్శించడం ద్వారా ఆయనను గౌరవించాలనుకుంటున్నాము. ఈ పండుగ కోసం 4కెలో నాలుగు చిత్రాలను పునరుద్ధరించి విడుదల చేస్తున్నాం. ఈ చిత్రాలను ప్రదర్శించడానికి మాతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ - NFDC-NFAI మధ్య ఒక ముఖ్యమైన బంధాన్ని కూడా ఇది సూచిస్తుంది. ది గ్రెగొరీ పెక్ ఆఫ్ ఇండియా, దేవ్ ఆనంద్ ని భారతీయ సినిమా చిరకాల లెజెండ్‌గా చేసిన కొన్ని చిత్రాలను చూసే అవకాశం సమకాలీన ప్రేక్షకులకు లభిస్తున్నందుకు మేం ఎంతో సంతోషిస్తున్నాము. భారతీయ సినిమా క్లాసిక్‌లను నేటితరానికి అందించడం అనేది ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రయాణంలో మరొక మైలురాయి. ఎందుకంటే ఈ చిత్రాలన్నీ మన చరిత్ర సంస్కృతిలో ఒక భాగం. మనం ఎక్కడ నుండి వచ్చామో మనకు తెలియకపోతే మనము ఎటు వెళ్తున్నామో తెలీదు'' అని అన్నారు.
దేవానంద్ కుమారుడు సునీల్ ఆనంద్ మాట్లాడుతూ-''మా నాన్న, లెజెండరీ దేవ్ ఆనంద్ 100వ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశం అంతటా పెద్ద ఎత్తున ఫిల్మ్ ఫెస్టివల్‌ని ప్లాన్ చేస్తున్నారని విన్నందుకు నేను సంతోషిస్తున్నాను. వారు చేస్తున్న పని గురించి నాకు తెలుసు. వారి ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. జానీ మేరా నామ్‌లో నాన్నగారి నటనను నేను వ్యక్తిగతంగా ఇష్టపడతాను. ఈ చిత్రంలో పోషించిన పాత్ర అతడి నిజమైన వ్యక్తిత్వాన్ని దగ్గరగా పోలి ఉండటమే దీనికి కారణం. నాన్నగారి హిస్ట్రియానిక్స్, మ్యానరిజమ్స్, సున్నితమైన డ్రెస్సింగ్ సెన్స్, జ్యువెల్ థీఫ్ స్లిక్ వెస్ట్రన్ - యూరోపియన్ సినిమాల ట్రాపింగ్స్ ఇవన్నీ ఆయన సినిమాల్లో కనిపిస్తాయి. నాన్న తన అనేక చిత్రాలలో ఫ్యాషన్ ట్రెండ్‌లను సెట్ చేశాడు. తన క్యాప్, హై కాలర్‌లు, స్కార్ఫ్‌లు, జాకెట్లు, రంగురంగుల వస్త్రధారణ ప్రతిదీ ప్రత్యేకమే. అతని కేశాలంకరణను కూడా అభిమానులు కాపీ చేసేవారు. నాన్నగారు ప్రయత్నిస్తే సులభంగా హాలీవుడ్‌కు వెళ్లవచ్చు. నిజానికి అప్పట్లో హాలీవుడ్ కాస్టింగ్ ఏజెన్సీ సైతం తనని ప్రమోట్ చేసేందుకు ఆఫర్ చేసింది. నాన్నగారి కోసం అనేక ప్రాజెక్ట్‌లను ఆఫర్ చేసింది.
కానీ నాన్న గారు వాటిని తిరస్కరించారు. ఆయన నిజమైన భారతీయుడు. తన మాతృభూమి భారతదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. కాలం గడుస్తుంది.. మనస్తత్వాలు మారుతున్నాయి.. ట్రెండ్‌లు అభివృద్ధి చెందుతాయి. అయినప్పటికీ ప్రతి కొత్త తరం సినీ ప్రేక్షకులు, అభిమానులతో దేవ్ ఆనంద్ కనెక్టయి ఉన్నారు. భారతదేశం సహా ప్రపంచంలోని ఇతర యువతకు స్ఫూర్తిగా కొనసాగుతూనే ఉన్నారు. అతనికి ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ సూపర్‌స్టార్ అనే బిరుదు ఏకగ్రీవంగా ఇచ్చారు. ఈ బిరుదు ఎప్పటికీ కొనసాగుతోంది. నాన్న తన నవ్‌కేతన్ బ్యానర్‌లో అద్భుతమైన సినిమాలు చేసారు. మనం నాన్న శతదినోత్సవం జరుపుకుంటున్నప్పుడు ఆయన సినిమాలు వాటి కాలం కంటే దశాబ్దాలు ముందున్నాయని నేను చెప్పాలనుకుంటున్నాను. మనం ఇప్పటికీ వాటి స్థాయిని అందుకోలేదని కొన్నిసార్లు నేను భావిస్తున్నాను. శతదినోత్సవ వేడుక పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది'' అని అన్నారు.