Begin typing your search above and press return to search.

దేవర… ఫ్యాన్స్ కోసం ఆ సర్ ప్రైజ్ వచ్చేసింది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. సినిమాకి అక్కడక్కడా కాస్త మిక్స్ డ్ రియాక్షన్స్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు.

By:  Tupaki Desk   |   4 Oct 2024 10:53 AM GMT
దేవర… ఫ్యాన్స్ కోసం ఆ సర్ ప్రైజ్ వచ్చేసింది
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. సినిమాకి అక్కడక్కడా కాస్త మిక్స్ డ్ రియాక్షన్స్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు. వీకెండ్స్ లో కూడా డీసెంట్ వసూళ్ళతో ఈ మూవీ 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటేసింది. మరల 5వ తేదీ నుంచి సినిమాకి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ‘దేవర’ ని కొత్తగా చూడాలనుకునే ఆడియన్స్ కోసం మేకర్స్ మూవీలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా జత చేశారు.


ఈ మూవీలోని జాన్వీ కపూర్, తారక్ పై చిత్రీకరించిన దావూది సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. సినిమా నిడివి తగ్గించడం కోసం ఆ సాంగ్ ని ముందుగా తొలగించారు. దావూది సాంగ్ లేకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు చాలా నిరుత్సాహానికి గురయ్యారు. అంత మంచి సాంగ్ ని ఎలా తొలగిస్తారంటూ సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ఇక ఫ్యాన్స్ ఆ సాంగ్ ని కావాలని బలంగా కోరుకోవడంతో మేకర్స్ కూడా దిగివచ్చారు.

సినిమాకి ఎలాగూ మంచి ఆదరణ లభిస్తోన్న నేపథ్యంలో దావూది సాంగ్ ని జతచేశారు. ఈ విషయన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. శుక్రవారం నుంచి థియేటర్స్ లో ప్రదర్శించే ప్రింట్ లో దావూది సాంగ్ అందుబాటులోకి వచ్చింది. జాన్వీ కపూర్ పాయింట్ అఫ్ వ్యూ నుంచి ఈ దావూది సాంగ్ ని సినిమాలో ప్రెజెంట్ చేశారు. ఈ పాటకి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

బిగ్ స్క్రీన్ పై దావూది సాంగ్ విజువలైజేషన్ జాన్వీ కపూర్ గ్లామర్, ఎన్టీఆర్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చూడటానికి ఫ్యాన్స్ ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సాంగ్ మూవీకి అదనపు అడ్వాంటేజ్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. సాంగ్ వర్క్ అవుట్ అయితే శని, ఆదివారాలు సినిమా కలెక్షన్స్ మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మూవీలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్ తో మరింత హైప్ రావడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.

ఈ వీకెండ్ వర్క్ అవుట్ అయితే ‘దేవర’ మూవీ కలెక్షన్స్ వచ్చే సోమవారం నాటికి 500 కోట్లకి చేరుకుంటాయని ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు. అదే జరిగితే ప్రభాస్ తర్వాత సోలోగా 500 కోట్ల క్లబ్ లో చేరిన సెకండ్ తెలుగు హీరోగా ఎన్టీఆర్ రికార్డ్ క్రియేట్ చేస్తాడు.