అమెరికాలో 'దేవర' దూకుడు
అమెరికా డిస్ట్రిబ్యూటర్ నుండి వచ్చిన తాజా సమాచారం మేరకు.. దేవర హవా అక్కడా కొనసాగనుంది. ప్రీ-సేల్స్ ఇప్పటికే 700కె డాలర్ల మార్కును దాటినట్లు అమెరికా ట్రేడ్ వెల్లడించింది.
By: Tupaki Desk | 8 Sep 2024 5:41 AM GMTఎన్టీఆర్- జాన్వీ నటించిన `దేవర` ప్రమోషనల్ మెటీరియల్ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. పాటలకు అద్భుత స్పందన వచ్చింది. ఈ చిత్రం 27 సెప్టెంబర్ 2024న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. శివ కొరటాల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో సైఫ్ అలీఖాన్ ప్రధాన విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆదిపురుష్ తర్వాత సైఫ్‌కి తెలుగులో రెండో భారీ చిత్రమిది.
దేవరలో ఎన్టీఆర్ వర్సెస్ సైఫ్ ఎపిసోడ్స్ పై భారీ అంచనాలున్నాయి. అలాగే జాన్వీతో తారక్ రొమాన్స్ ఒక రేంజులో పండిందని ఇప్పటికే విడుదలైన విజువల్స్ చెబుతున్నాయి. కొరటాల కథ - కాన్వాసుపై అందరికీ బలమైన నమ్మకం ఉంది. ఇవన్నీ ఈ సినిమాకి పెద్ద ప్లస్ కానున్నాయి.
అమెరికా డిస్ట్రిబ్యూటర్ నుండి వచ్చిన తాజా సమాచారం మేరకు.. దేవర హవా అక్కడా కొనసాగనుంది. ప్రీ-సేల్స్ ఇప్పటికే 700కె డాలర్ల మార్కును దాటినట్లు అమెరికా ట్రేడ్ వెల్లడించింది. ఇది దేవుర చుట్టూ ఉన్న హైప్ కి నిదర్శనం. ఈ ప్రీసేల్ అంచనాలను పెంచడమే కాకుండా, సానుకూల బజ్‌ను క్రియేట్ చేస్తోంది. అమెరికా థియేటర్లలో విడుదలకు ముందే దేవర అద్భుతమైన బాక్సాఫీస్ నంబర్‌లను సాధించగలదని తారక్ అభిమానులు విశ్వసిస్తున్నారు.
దేవర ఆల్బమ్ విజయం సాధించడం.. ట్యూన్స్ ప్రజలకు నచ్చడంతో ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో హుషారు పెరిగిందని కూడా విశ్లేషిస్తున్నారు. ముగ్గురు ప్రధాన తారలతో పాటు సపోర్టింగ్ ఆర్టిస్టులు సీనియర్లే కావడం అస్సెట్. శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ వంటి సీనియర్ తారలు ఇందులో నటించారు. దేవరను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. అతడి బీజీఎం సినిమాకి ప్రధాన అస్సెట్ కానుంది. ఈ చిత్రం అన్ని ప్రధాన భారతీయ భాషలలో విడుదల కానుంది.