Begin typing your search above and press return to search.

దేవర.. మరో సర్ ప్రైజ్ ఉంటుందా?

గత కొన్నేళ్లుగా సౌత్ లో స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   11 Sep 2024 5:30 PM GMT
దేవర.. మరో సర్ ప్రైజ్ ఉంటుందా?
X

గత కొన్నేళ్లుగా సౌత్ లో స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. యూనివర్శల్ కథలతో దేశ వ్యాప్తంగా ప్రేక్షకులకి రీచ్ అయ్యే కంటెంట్ లతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇలాంటి కథలని భారీ బడ్జెట్ తో తెరకెక్కించడానికి నిర్మాతలు కూడా ముందుకొస్తున్నారు. అయితే పాన్ ఇండియా కథలతో సినిమాలు చేస్తున్నప్పుడు కంటెంట్ ని బలంగా జనాల్లోకి పంపించాలి. మూవీ ప్రమోషన్స్ అన్ని ఒక ఎత్తైతే సినిమా కథాంశం, టీజర్, ట్రైలర్స్ మరో ఎత్తు.

అందుకే ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాలకి రెండేసి ట్రైలర్స్ రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ కి 20-30 రోజుల ముందు ఒక ట్రైలర్ వదులుతున్నారు. దానికి వచ్చే రెస్పాన్స్ బట్టి రిలీజ్ కి రెండు రోజుల ముందు మరో ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ సలార్, కల్కి 2898ఏడీ సినిమాలకి ఇదే ఫార్ములా అమలు చేశారు. ముందుగా రిలీజ్ చేసిన ట్రైలర్ కి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. తరువాత సినిమా రిలీజ్ కి ముందు వదిలిన సలార్, కల్కి 2898ఏడీ సినిమాల ట్రైలర్స్ మాత్రం బాగా క్లిక్ అయ్యాయి.

మూవీపైన పాజిటివి బజ్ క్రియేట్ చేశాయి. ఆ రెండు సినిమాలు ఎంత సక్సెస్ అయ్యాయో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇదే ఫార్ములాని కొరటాల శివ దేవర పార్ట్ 1కి కూడా ఉపయోగిస్తున్నారనే మాట వినిపిస్తోంది. సెప్టెంబర్ 10న దేవర పార్ట్ 1 ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 35 మిలియన్ వ్యూవ్స్ ని ఈ ట్రైలర్ క్రాస్ చేసింది. అయితే ఒక వర్గం నుంచి ట్రైలర్ కి మిక్సడ్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ నేపథ్యంలో కొరటాల శివ అండ్ కో దేవర పార్ట్ 1 రిలీజ్ ముందు మరో ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారంట. మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ రోజు లేదంటే ముందుగానే ఈ రిలీజ్ ట్రైలర్ ని వదలొచ్చని అనుకుంటున్నారు. అదే జరిగితే కచ్చితంగా రిలీజ్ ట్రైలర్ తో మూవీకి ఎంతో కొంత అదనపు ప్రమోషన్ లభిస్తుంది. కంటెంట్ కూడా మరింత బలంగా జనాలకి రీచ్ అవుతుంది.

ఫస్ట్ డే కలెక్షన్స్ పెరుగుదలకి ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారు. దేవర మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా ఐదు భాషలలో రిలీజ్ అవుతూ ఉంది. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారు. ఇప్పటికే దేవర మూవీపైన 350-400 కోట్ల మధ్యలో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. భారీ అంచనాల మధ్యలో ఈ చిత్రం థియేటర్స్ లోకి వస్తోంది.