Begin typing your search above and press return to search.

సైలెంట్ గా మొదలైన దేవర 'ఆయుధ పూజ'

ముఖ్యంగా, ఎన్టీఆర్ 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా కనిపించబోతుండటంతో అభిమానుల కోసం ఈ సినిమా మరింత స్పెషల్‌గా మారింది.

By:  Tupaki Desk   |   26 Sep 2024 3:56 PM GMT
సైలెంట్ గా మొదలైన దేవర ఆయుధ పూజ
X

దేవర సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుండగా, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ రిలీజ్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. గత కొన్ని నెలలుగా ఈ సినిమా పై క్రియేట్ అయిన హైప్ గురించి అందరికీ తెలిసిందే. మొదటి నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ అన్నీ కూడా సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ముఖ్యంగా, ఎన్టీఆర్ 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా కనిపించబోతుండటంతో అభిమానుల కోసం ఈ సినిమా మరింత స్పెషల్‌గా మారింది.

ఫైనల్ గా దేవర: పార్ట్ 1 సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో సర్ ప్రైజ్ చేయనున్నాడు, అందులో యువ ఎన్టీఆర్ కు జాన్వీ కపూర్ జోడీగా కనిపించనుంది. మరోవైపు, పెద్ద ఎన్టీఆర్ పాత్రకు జోడిగా సీనియర్ హీరోయిన్ కనిపించనుందని సమాచారం. సినిమాలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ కనిపిస్తుండగా, ఆయన పాత్ర ట్రైలర్ లోనే మంచి ఇంపాక్ట్ చూపించింది.

ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆయుధ పూజ సాంగ్ ని ఎట్టకేలకు యూనిట్ ఊహించని రీతిలో విడుదల చేసింది. ఈ సాంగ్ పై ముందు నుంచే అభిమానుల్లో ఆసక్తి పెరిగినా, భారీ ప్రమోషన్లలో కాకుండా సైలెంట్ గా విడుదల చేయడం విశేషం. రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం, అనిరుద్ సంగీతం ఈ సాంగ్ ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. సినిమా థీమ్ మొత్తం ఈ పాటలో కనిపించడం మరో విశేషం.

అడ్వాన్స్ బుకింగ్స్ లో దేవర ఇప్పటికే రికార్డులను బద్దలు కొడుతోంది. కొరటాల శివ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. తెలుగు భాషతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ పాన్ ఇండియా మూవీ విడుదల అవుతోంది. ఆర్ఆర్ఆర్ విజయం తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో సినిమా కావడంతో, అభిమానులు ఈ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

సినిమా విడుదలకు ముందు నుంచే అభిమానుల హంగామా ప్రారంభమై, థియేటర్ల దగ్గర సందడి నెలకొంది. మొత్తానికి దేవర బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి రోజే సినిమా ఈజీగా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం పక్కా అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి ఆ అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.