Begin typing your search above and press return to search.

'దేవర' ఆయుధపూజ పాన్‌ ఇండియా బ్లాస్ట్ ఖాయం...!

ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌ లో జనతా గ్యారేజ్ తర్వాత రాబోతున్న చిత్రం 'దేవర'.

By:  Tupaki Desk   |   14 Sep 2024 5:33 AM GMT
దేవర ఆయుధపూజ పాన్‌ ఇండియా బ్లాస్ట్ ఖాయం...!
X

ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌ లో జనతా గ్యారేజ్ తర్వాత రాబోతున్న చిత్రం 'దేవర'. జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్ అలీ ఖాన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్‌ రోల్‌ లో కనిపించబోతున్నాడు. రెండు విభిన్నమైన పాత్రలను చేయడం ఎన్టీఆర్‌ కి కొత్తేం కాదు. కనుక దేవర లో ఎన్టీఆర్‌ తన ఫ్యాన్స్ కి డబుల్‌ ధమాకా ఇవ్వడం ఖాయం. ఇప్పటికే నెట్టింట దేవర క్రేజ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగి పోయింది. అంతే కాకుండా యూఎస్ లో ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్ లో సరికొత్త రికార్డును నమోదు చేసింది.

ట్రైలర్‌ విడుదలకు ముందే ఒక మిలియన్‌ డాలర్ల వసూళ్లను సొంతం చేసుకున్న దేవర తాజాగా 1.5 మిలియన్‌ డాలర్ల వసూళ్లు సొంతం చేసుకుంది. విడుదలకు ముందే రెండు మిలియన్ డాలర్ల వసూళ్లను దేవర సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేవర నుంచి వరుసగా అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయి. ప్రమోషన్ లో భాగంగా ఇటీవల ముంబై ఈవెంట్ లో పాల్గొన్న ఎన్టీఆర్‌, అక్కడే ట్రైలర్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్‌ లో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌ సేన్‌ లతో ఎన్టీఆర్‌ ఇంటర్వ్యూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అతి త్వరలోనే ఆ ఇంటర్వ్యూ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సినిమా అంచనాలను మరింతగా పెంచే విధంగా 'దేవర' నుంచి ఆయుధపూజ సాంగ్‌ ను విడుదల చేయబోతున్నారు. రామజోగయ్య శాస్త్ర గత రెండు మూడు రోజులుగా ఈ పాట గురించి హైప్‌ క్రియేట్‌ చేస్తూ ట్వీట్‌ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌ దేవర స్థాయిని మరింతగా పెంచింది అనడంలో సందేహం లేదు. దేవర నుంచి వచ్చే వారం బిగ్గెస్ట్‌ పాన్‌ ఇండియా బ్లాస్ట్‌ రాబోతుంది. ఫ్యాన్స్ అంతా ఎదురు చూడండి అంటూ రామజోగయ్య శాస్త్రి చెప్పుకొచ్చాడు. ఇప్పటికే సినిమాకు ఉన్న క్రేజ్ ను రెట్టింపు చేసే విధంగా ఆయుధపూజ సాంగ్ ఉంటుందని మేకర్స్ నుంచి సమాచారం అందుతోంది.

ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫియర్ సాంగ్, చుట్టమల్లె, దావూదీ పాటలు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా చుట్టమల్లె పాట పాన్ ఇండియా స్థాయిలో ట్రెండ్ అయింది. ఇక ట్రైలర్ కూడా మొత్తం దేశం మొత్తం ఊపేసింది. అందుకే ఆయుధపూజ సాంగ్ అంతకు మించి ఉంటుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుధ్‌ అందిస్తున్న మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. ఆకట్టుకునే విధంగా సినిమా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని కూడా మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.