దేవర బాక్సాఫీస్.. ఫైనల్ గా టార్గెట్ ఎంతంటే..
ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ పై ట్రోల్స్ వచ్చినప్పటికీ కూడా యూట్యూబ్ లో మాత్రం వ్యూస్ పరంగా బాగానే క్లిక్ అయ్యాయి.
By: Tupaki Desk | 19 Sep 2024 9:39 AM GMTబిగ్ పాన్ ఇండియా మూవీ దేవర పార్ట్ 1 మరో వారం రోజుల్లో బాక్సాఫీస్ వద్ద దండయాత్రకు సిద్ధం కాబోతోంది. సినిమాపై ఇప్పటికే ఫ్యాన్స్ లో అయితే కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. అలాగే మరో వర్గం నుంచి విభిన్నమైన కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ పై ట్రోల్స్ వచ్చినప్పటికీ కూడా యూట్యూబ్ లో మాత్రం వ్యూస్ పరంగా బాగానే క్లిక్ అయ్యాయి.
అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ ప్రమోషన్ చేస్తున్న విధానం, అతని కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే తప్పకుండా సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది అని ఫాన్స్ అయితే నమ్ముతున్నారు. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత టార్గెట్ తో విడుదల కాబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొన్నటి వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ నెంబర్ల పై రకరకాల గాసిప్స్ అయితే వినిపించాయి.
ఇక లేటెస్ట్ గా ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న ఒక టాక్ ప్రకారం బిజినెస్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మొదటి నుంచి మంచి ఆఫర్స్ అయితే వచ్చాయి. ఇక నైజాం అలాగే ఆంధ్రప్రదేశ్లో కలుపుకుని దాదాపు 113 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక కర్ణాటకలో కూడా ఎన్టీఆర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అక్కడ ఈ సినిమా హక్కులు 15 కోట్లకు అమ్ముడయినట్లుగా తెలుస్తోంది.
తమిళనాడులో 6 కోట్లు వరకు ఈ సినిమా బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక హిందీ బెల్ట్ లో మేకర్స్ కాస్త ఎక్కువగానే ఆఫర్స్ వస్తాయని ఎదురు చూశారు. కానీ అక్కడ 15 కోట్లకు క్లోజ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ లో మాత్రం ఎన్టీఆర్ కెరియర్ లోనే అత్యధికంగా 26 కోట్లకు ఈ సినిమా బిజినెస్ చేసినట్లు సమాచారం.
మిగతా కంట్రీస్ లో చూసుకుంటే 4 కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా దేవర 1 సినిమా 180 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవాలి అంటే తప్పనిసరిగా 185 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. ఇక గ్రాస్ పరంగా లెక్క 350 కోట్లు దాటాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈ టార్గెట్ అందుకోవాలి అంటే టాజ్ మాత్రం గట్టిగా ఉండాలి. మొదటి రోజు వచ్చే రెస్పాన్స్ ని బట్టి మిగతా రోజుల్లో ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది.
ప్రాంతాల వారీగా చూసుకుంటే..
నైజాం 45.0 కోట్లు
వైజాగ్ 12.5 కోట్లు
ఈస్ట్ 8.0 కోట్లు
వెస్ట్ 6.0 కోట్లు
కృష్ణ 7.0 కోట్లు
గుంటూరు 8.5 కోట్లు
నెల్లూరు 4.0 కోట్లు
సీడెడ్ 22.0 కోట్లు
నైజాం + ఏపీ మొత్తం 113 కోట్లు
కర్ణాటక 15.0 కోట్లు
తమిళనాడు 6.0 కోట్లు
కేరళ 0.5 కోట్లు
హిందీ బెల్ట్ 15.0 కోట్లు
విదేశాలు 26.0 కోట్లు
ప్రింట్స్ & పబ్లిసిటీ 4.5 కోట్లు
మొత్తం ప్రపంచ వ్యాప్త థియేట్రికల్ బిజినెస్ 180 కోట్లు