Begin typing your search above and press return to search.

దేవర బాక్సాఫీస్.. ఈజీ టార్గెట్?

తారక్ కూడా దేవర సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   29 Aug 2024 3:41 AM GMT
దేవర బాక్సాఫీస్.. ఈజీ టార్గెట్?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా ఐదు భాషలలో ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా దేవర మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. తారక్ కూడా దేవర సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు.

ఇదిలా ఉంటే భారీ బడ్జెట్ కొరటాల శివ దర్శకత్వంలో రెడీ అవుతోన్న ఈ సినిమాని యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 300 కోట్ల వరకు దేవర సినిమాకి ఖర్చు పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఇప్పటికే కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. నాన్ థీయాట్రికల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ 155 కోట్లకి కొనుగోలు చేసిందంట. ఎన్టీఆర్ కెరియర్ లోనే హైయెస్ట్ ఓటీటీ రైట్స్ ఈ చిత్రానికి వచ్చాయి.

ఇక ఈ మూవీ అన్ని ఏరియాల ప్రీరిలీజ్ బిజినెస్ అయిపొయింది. మూవీ బిజినెస్ లెక్కల గురించి సోషల్ మీడియాలో ఇంటరెస్టింగ్ ప్రచారం నడుస్తోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల బ్రేక్ ఈవెన్ 130 కోట్ల వరకు ఉందంట. అలాగే అన్ని భాషలకి కలుపుకొని వరల్డ్ వైడ్ గా 200 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్స్ లో రాబోతోందంట. ఈ లెక్కన చూసుకుంటే దేవర సినిమాకి ఈ బ్రేక్ ఈవెన్ అందుకోవడం కేక్ వాక్ అని ఫ్యాన్స్ అంటున్నారు.

పాన్ ఇండియా హీరోలకి 200 కోట్ల టార్గెట్ అనేది చాలా చిన్నదని చెబుతున్నారు. ఎన్టీఆర్ మార్కెట్ రేంజ్ ఆ రేంజ్ లోనే ఉంది. దేవర సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన కూడా 500+ కోట్ల కలెక్షన్స్ ని చాలా ఈజీగా దాటేస్తుంది. మినిమమ్ యావరేజ్ టాక్ వచ్చిన కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్ షేర్ ని సులభంగా అందుకుంటుందని భావిస్తున్నారు. మరి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ సినిమా బిజినెస్ లెక్కలు ఎంత వరకు కరెక్ట్ అనే అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.

మూవీ రిలీజ్ కి టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో దేవర సినిమా ప్రమోషన్స్ కూడా షురూ చేసే పనిలో చిత్ర యూనిట్ ఉంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత దేవర సినిమాపై వరల్డ్ వైడ్ గా ఎంత బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ లెక్కలు ఎంత అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.