Begin typing your search above and press return to search.

'దేవ‌ర‌'కు ఎన్టీఆర్‌- సైఫ్ ఖాన్ పారితోషికాలు?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన `దేవ‌ర` ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత భారీగా విడుద‌లైంది.

By:  Tupaki Desk   |   27 Sep 2024 11:30 PM GMT
దేవ‌ర‌కు ఎన్టీఆర్‌- సైఫ్ ఖాన్ పారితోషికాలు?
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన `దేవ‌ర` ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత భారీగా విడుద‌లైంది. మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మైనా కానీ, ఎన్టీఆర్ ద్విపాత్ర‌ల‌తో అద‌ర‌గొట్టాడ‌న్న టాక్ ఉంది. యాక్ష‌న్, బీజీఎం వంటివి సినిమాకి ప్ర‌ధాన అస్సెట్ గా నిలిచాయ‌ని క్రిటిక్స్ ప్ర‌శంసించారు. ఇక ఎన్టీఆర్ క్రేజ్ తో తెలుగు రాష్ట్రాలు స‌హా అమెరికా ఓవ‌ర్సీస్ లోను భారీ ఓపెనింగులు సాధ్య‌మ‌వుతున్నాయ‌ని ట్రేడ్ చెబుతోంది.

సినిమా మొత్తాన్ని త‌న భుజ‌స్కంధాల‌పై ఎన్టీఆర్ న‌డిపించాడు. సైఫ్ అలీఖాన్ విల‌నీ ఆక‌ట్టుకుంది. ఇక జాన్వీ అంద‌చందాలు ప్ల‌స్. తాజాగా దేవర కోసం ఎన్టీఆర్ పారితోషికం ఎంత‌? ఇత‌ర‌ స్టార్ కాస్ట్ ఎవ‌రెవ‌రు ఎంత అందుకున్నారు? అన్న‌దానిపై అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన `దేవ‌ర` మొత్తం బడ్జెట్‌లో 26 శాతం ప్రధాన తారాగణం కోసం పారితోషికంగా చెల్లించార‌ని టాక్ ఉంది. ప్రధాన తారాగణంలో ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, శ్రీ‌కాంత్ ఉన్నారు. మొత్తంగా స్టార్‌కాస్ట్ కోసం దాదాపు 78 - 80 కోట్లు చెల్లించార‌ని తెలిసింది.

RRRలో కొమ‌రం భీమ్‌గా న‌టించి అంత‌ర్జాతీయంగా ఫేమ్ సంపాదించిన ఎన్టీఆర్ ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ కోసం తన ఫీజును 33శాతం పెంచారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ కోసం తార‌క్ 45 కోట్ల పారితోషికం తీసుకున్నాడు. దేవ‌ర‌ చిత్రానికి 60 కోట్లు వసూలు చేసినట్లు ఊహాగానాలు ఉన్నాయి. ఇది సినిమా మొత్తం బడ్జెట్‌లో దాదాపు 20 శాతం. మొత్తం నటీనటుల రెమ్యునరేషన్‌పై ఖర్చు చేసిన మొత్తంలో దాదాపు 75 శాతం ఎన్టీఆర్‌కే వెళ్లింది.

ఇతర నటీన‌టుల పారితోషికాల వివ‌రాల్లోకి వెళితే.. జాన్వీ కపూర్ ఒక్కో చిత్రానికి మొదట 3.5 కోట్లు వసూలు చేస్తుందని టాక్. అయితే దేవ‌ర లో న‌టించినందుకు పారితోషికం 5 కోట్లకు పెంచింద‌ట‌. అదే సమయంలో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను పోషించడానికి 10 కోట్ల పారితోషికం తీసుకున్నారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కి 1.5 కోట్లు చెల్లించారు. 60 కోట్ల పారితోషికం అంటే ప్రకాష్ రాజ్ కంటే 40 రెట్లు ఎక్కువ మొత్తాన్ని తార‌క్ అందుకున్నాడు. ఈ చిత్రంలో న‌టించిన శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు శ్రీకాంత్‌కు 50 లక్షలు, మురళీ శర్మ, నరైన్‌లకు ఒక్కొక్కరికి 40 లక్షలు, కళైయరసన్‌లకు 25 లక్షలు పారితోషికం అందింద‌ని స‌మాచారం.