Begin typing your search above and press return to search.

దేవర – మీరు మెచ్చిన ఫుల్ సాంగ్ వచ్చేసింది

పాటలో జాన్వీ అందం ఎన్టీఆర్ స్టెప్పులు హైలెట్ గా నిలిచాయి.

By:  Tupaki Desk   |   26 Oct 2024 2:53 PM GMT
దేవర – మీరు మెచ్చిన ఫుల్ సాంగ్ వచ్చేసింది
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంలోని ‘చుట్టమల్లే’ పాట ఎంతటి పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాట విడుదలైన మొదటి సాంగ్ తో పోలిస్తే ఇంకా ఎక్కువ ఆదరణ పొందింది. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా ఈ పాట జాన్వీ కపూర్ గ్లామర్ మరియు సంగీతంతో కూడుకున్న ప్రత్యేకతలతో ఎంతోమందిని ఆకట్టుకుంది. సామాజిక మాధ్యమాల్లో ఈ పాట పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతూ, యూట్యూబ్‌లో కొన్ని రోజుల్లోనే లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఇక ఈ పాట ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. పాటలో జాన్వీ అందం ఎన్టీఆర్ స్టెప్పులు హైలెట్ గా నిలిచాయి. ఇక అనిరుధ్ మెలోడీ ట్యూన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిమిషాల్లోనే ఈ ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్ టాప్ ట్రేండింగ్ లిస్ట్ లో చేరిపోయింది. ఈ పాటకు సంబంధించి వచ్చిన వివిధ రీల్స్ కూడా వైరల్ అయ్యాయి.

ఇక ఆ మధ్య ఈ పాట ఇంగ్లీష్ వెర్షన్ కూడా ట్రెండ్ అయ్యింది. ఓ విదేశీయుల బృందం ఈ పాటను ఇంగ్లీష్‌లో పునర్నిర్మించారు. అందులో ఫారినర్స్ జంటతో వీడియో షూట్ చేయడం, హాలీవుడ్ పాప్ పాటలను తలపించేలా పాటను రూపొందించడం ప్రత్యేకతగా మారింది. మొదటి పల్లవి తెలుగులో ఉండగా, తర్వాతి చరణాలు ఇంగ్లీష్‌లో ఉండడం ద్వారా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

ఇది ఫ్యాన్స్‌కు కొత్తగా కనిపించడం మరియు ఎన్టీఆర్ స్టామినాని హైలైట్ చేయడం వల్ల ఈ వీడియో వేగంగా వైరల్ అయ్యింది. ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాక, సామాన్య ప్రేక్షకులు సైతం దీనిపై సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ ఇంగ్లీష్ వెర్షన్ మోడరన్ ఫ్యూజన్‌గా ఉండి, విదేశీయులు కూడా భారతీయ పాటలను ఇష్టపడుతున్నారనే విషయం తెలియజేస్తోంది.

ఇటీవల విదేశీయులు భారతీయ పాటలకు చేసిన డాన్స్ వీడియోలు, తమ భాషలో భారతీయ పాటలను పునర్నిర్మించడంలో క్రియేటివిటీ చూపుతున్నారు. ఈ ట్రెండ్‌లో భాగంగా ‘చుట్టమల్లే’ ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఒక సరికొత్త ప్రయోగం అని చెప్పొచ్చు. విదేశీయుల ద్వారా ఈ పాటను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా పాట మరింత పాపులర్ అవుతుందనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తపరుస్తున్నారు.

ఇక సినిమా విషయానికి వస్తే, ‘దేవర’ చిత్రం బ్రేక్ ఈవెన్ చేరుకొని, ఎన్టీఆర్ కెరీర్‌లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సోలో మూవీగా నిలిచింది. ఇప్పటికే 500 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇదిలా ఉంటే, ‘దేవర’ సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ డిసెంబర్‌లో మొదలవుతుందని, వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం.