నార్త్ అమెరికాలో దేవర లెక్క.. ఎంతవరకు వెళ్లిందంటే..
ఇక మూడో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమాకి దసరా ఫెస్టివల్ ప్లస్ కాబోతోందనే మాట వినిపిస్తోంది.
By: Tupaki Desk | 11 Oct 2024 6:27 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో మరో కమర్షియల్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. సినిమాకి మొదటి రోజు కాస్త టాక్ మిక్స్ డ్ గా వచ్చినా కూడా ప్రేక్షకులు సంపూర్ణంగా ఆదరించినట్లు ఈ సినిమా కలెక్షన్స్ బట్టి అర్ధమవుతోంది. సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఇక మూడో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమాకి దసరా ఫెస్టివల్ ప్లస్ కాబోతోందనే మాట వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే నార్త్ అమెరికాలో కూడా ‘దేవర’ సినిమాకి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. మొదటి రోజే 2.8 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ అందుకున్న ఈ మూవీ రెండు వారాల్లో ఏకంగా 6 మిలియన్ డాలర్స్ వసూళ్లు చేసింది. తద్వారా ఎన్టీఆర్ కెరియర్ లో సోలోగా అత్యధిక కలెక్షన్స్ ని నార్త్ అమెరికా కలెక్ట్ చేసిన చిత్రంగా ‘దేవర’ నిలిచింది. ఇదే జోరు దసరా హాలిడేస్ లో కొనసాగితే లాంగ్ రన్ లో 7 మిలియన్ డాలర్స్ వరకు నార్త్ అమెరికాలో ఈ మూవీ వసూళ్లు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
‘దేవర’ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 500 కోట్లకి దగ్గరలో ఉంది. లాంగ్ రన్ లో 500+ కలెక్షన్స్ ని ఈ మూవీ అందుకుంటుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఇప్పటికే మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకొని లాభాల్లోకి వచ్చిందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కావడంతో ‘దేవర పార్ట్ 2’ విషయంలో కొరటాల శివ పైన చాలా పెద్ద బాద్యత పడింది.
మొదటి పార్ట్ లో ఉన్న మైనస్ లు కవర్ చేస్తూ ఫ్యాన్స్, క్రిటిక్స్ నుంచి వచ్చిన నెగిటివ్ రివ్యూలని పరిగణంలోకి తీసుకొని ‘దేవర 2’ ని మరింత పర్ఫెక్ట్ గా సిద్ధం చేయాల్సి ఉంటుంది. కొరటాల కూడా ఇప్పటికే పార్ట్ 2 పైన కొంత క్లారిటీ ఇచ్చేశాడు. పార్ట్ 1లో 10 శాతం కథ మాత్రమే చూసారని పార్ట్ 2లో 90 శాతం స్టొరీ ఉంటుందని చెప్పారు.
అలాగే జాన్వీ కపూర్ తంగం, వర క్యారెక్టర్స్ మధ్య ఎక్కువ స్టొరీ ఉంటుందని కూడా స్పష్టం చేశారు. మొదటి పార్ట్ లో మిస్ అయిన అన్ని ఎలిమెంట్స్ సెకండ్ పార్ట్ లో ఉంటాయని అన్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ‘దేవర పార్ట్ 2’ పై చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన 1000 కోట్లు కలెక్షన్స్ గ్యారెంటీ అని భావిస్తున్నారు.