Begin typing your search above and press return to search.

సముద్రంలో దేవర.. మాస్ కటౌట్

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కి దేశ వ్యాప్తంగా ఫ్యాన్ బేస్ పెరిగింది.

By:  Tupaki Desk   |   14 Sep 2024 10:04 AM GMT
సముద్రంలో దేవర.. మాస్ కటౌట్
X

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కి దేశ వ్యాప్తంగా ఫ్యాన్ బేస్ పెరిగింది. దీని తర్వాత తారక్ నుంచి రాబోతున్న చిత్రం దేవర. అందుకే ఈ చిత్రం పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ తో ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగాయి. కొరటాల శివ కూడా ఈ చిత్రాన్ని చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారు. హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ఈ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి రాబోతోంది.


ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ముంబైలో కరణ్ జోహార్, అలియాభట్ లాంటి సెలబ్రెటీలతో ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాలలో ప్రమోషన్స్ పైన ఎన్టీఆర్ ఫోకస్ చేశారు. విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డకి ఇంటర్వ్యూ ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్ని రాష్ట్రాలలో కూడా దేవర సినిమాపైన అంచనాలు పీక్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ముంబైలో సినిమాని వీలైనంత ఎక్కువ మందికి రీచ్ చేసే ఉద్దేశ్యంతో వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

అందులో భాగంగా మేకర్స్ దేవరలోని ఎన్టీఆర్ లుక్ తో పెద్ద కటౌట్ లు సముద్రంలో ఏర్పాటు చేశారు. ముంబైలోని దాదర్ చౌపటీ బీచ్ వద్ద సముద్రంలో ఈ భారీ కటౌట్ ని పెట్టారు. సోమవారం నుంచి గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఆ సమయంలో నిమజ్జనానికి వచ్చేవారందరు చూసే విధంగా ఈ కటౌట్ ని పెట్టడం జరిగింది. బీచ్ కి వచ్చేవారందరు ఈ కటౌట్ ని చూడొచ్చని దేవర టీమ్ ట్వీట్ చేసింది.

సముద్రంలో ఏర్పాటు చేసిన ఈ కటౌట్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాలలో కూడా ఇలాంటి భారీ కటౌట్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ముంబైలో ఏర్పాటు చేసిన కటౌట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కి దేశ వ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ ఉందని ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు.

దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. పెద్ద ఎన్టీఆర్ క్యారెక్టర్ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జాన్వీ కపూర్ దేవర మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాతో తనకి పాన్ ఇండియా హీరోయిన్ బ్రాండ్ వస్తుందని నమ్మకంగా ఉంది. సైఫ్ అలీఖాన్ కూడా దేవర సినిమాతో ప్రతినాయకుడిగా ప్రూవ్ చేసుకొని అన్ని భాషలలో తన ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని అనుకుంటున్నారు.