Begin typing your search above and press return to search.

దేవర 'దావుడి' సాంగ్.. మాస్ విజిల్స్ పక్కా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'దేవర' పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది.

By:  Tupaki Desk   |   4 Sep 2024 12:11 PM GMT
దేవర దావుడి సాంగ్.. మాస్ విజిల్స్ పక్కా
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'దేవర' పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాంగ్స్ కు హైప్ పెంచుతున్నాయి. "ఫియర్ సాంగ్" మరియు "చుట్టమల్లే" పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చే మూడో పాట కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.

ఈరోజు విడుదలైన "దావుడి" పాటతో ఆ ఎదురుచూపులకు తెరపడింది. ఈ పాపులర్ సాంగ్, అనిరుధ్ రవిచందర్ స్వరపరచిన క్యాచీ బీట్స్ తో నిండిన హై ఎనెర్జిటిక్ డ్యాన్స్ నెంబర్‌గా నిలిచింది. రామజోగయ్య శాస్త్రి అందించిన చమత్కారమైన లిరిక్స్ ఈ పాటకు మరింత ఆకర్షణను తీసుకొచ్చాయి, చూస్తుంటే మాస్ ఆడియెన్స్ చేత విజిల్స్ వేయించేలా ఉందని అనిపిస్తుంది.

ఇప్పటికే విడుదలైన రెండు పాటలు యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేశాయి. ఇక దావుడి పాట కూడా అదే రేంజ్ లో క్లిక్కయేలా కనిపిస్తోంది. ఈ పాటను తెలుగు భాషలో నకాష్ అజీజ్ మరియు అకాసా తమ శక్తివంతమైన స్వరాలతో పాడారు. వారి గాత్రం పాటకు ఒక ప్రత్యేకమైన వైబ్‌ను ఇచ్చింది. ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్ మధ్య ఉన్న కెమిస్ట్రీ, వారి డ్యాన్స్ మూవ్స్ పాటను ఒక అద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా మార్చాయి.

ఈ పాటను అన్ని భాషల్లో అభిమానులు తెగ ఎంజాయ్ చేయడం పక్కా అని చెప్పవచ్చు. ఇక శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించిన ఈ పాటను థియేటర్లలో అభిమానులు పండగలా సెలబ్రేట్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం వంటి పలు భాషల్లో విడుదల చేయనున్నారు.

అలాగే ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో వంటి ప్రముఖ నటులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ భైరా అనే విలన్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై బాలీవుడ్ లో కూడా మంచి హైప్ తో రిలీజ్ కాబోతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. సుధాకర్ మిక్కిలినేని మరియు కొసరాజు హరికృష్ణ నిర్మాణంలో, యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.