Begin typing your search above and press return to search.

దేవర 5వ రోజు కలెక్షన్స్.. ఎలా ఉన్నాయంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీకి వీక్ డేస్ లో కూడా ఏ మాత్రం తగ్గడం లేదు.

By:  Tupaki Desk   |   2 Oct 2024 5:36 AM GMT
దేవర 5వ రోజు కలెక్షన్స్.. ఎలా ఉన్నాయంటే..
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీకి వీక్ డేస్ లో కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వన్ మెన్ షో, అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలిచాయి. సినిమా చూసి బయటకి వస్తోన్న ఆడియన్స్ లలో ఎక్కువ మంది ఈ రెండు విషయాలని ప్రస్తావిస్తున్నారు. చాలా రోజుల తర్వాత టాలీవుడ్ ఆడియన్స్ అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ గురించి గొప్పగా చెబుతున్నారు.

గత ఏడాది తమిళంలో వచ్చిన ‘జైలర్’, ‘లియో’ సినిమాలని కూడా అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ నిలబెట్టింది. ఆ సినిమాల సక్సెస్ లలో అనిరుద్ భాగస్వామ్యం ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సోమవారం తెలుగు 5+ కోట్ల షేర్ వచ్చింది. ఐదో రోజు కూడా 5.55 కోట్ల షేర్ ఈ సినిమాకి రావడం విశేషం. నైజాంలో 2.37 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ఐదో రోజు వచ్చాయి. ఓవరాల్ గా ఇప్పటి వరకు 37.75 కోట్ల షేర్ కలెక్షన్స్ ని ‘దేవర’ మూవీ నైజాంలో వసూళ్లు చేసింది.

ఇక సీడెడ్ చూసుకుంటే ఐదో రోజు 1.22 కోట్ల వసూళ్లు చేస్తే ఓవరాల్ గా ఇప్పటి వరకు 20.63 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోగలిగింది. వైజాగ్ లో ఐదో రోజు 58 లక్షలు కలెక్షన్స్ సాధించగా, ఓవరాల్ గా 10.21 కోట్ల షేర్ కలెక్షన్స్ ని వసూళ్లు చేసింది. తూర్పు గోదావరిలో ఐదో రోజు 29 లక్షలు, పశ్చిమ గోదావరిలో 24 లక్షలు, కృష్ణా జిల్లాలో 30 లక్షలు, గుంటూరులో 29 లక్షలు, నెల్లూరులో 26 లక్షల షేర్ ని ‘దేవర’ మూవీ ఐదో రోజు కలెక్ట్ చేసింది.

ఓవరాల్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం 98.64 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి పబ్లిక్ హాలిడే వచ్చింది. తరువాత కూడా వరుసగా దసరా సెలవులు కలిసి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో దేవర కలెక్షన్స్ మరల పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదే స్పీడ్ లో మూవీకి వసూళ్లు వస్తే ఈ వీకెండ్ కు ‘దేవర’ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 500 కోట్లకి చేరుకుంటాయని భావిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలలో ఐదో ‘దేవర’ కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి.

నైజాం - 2.37 కోట్లు

సీడెడ్ - 1.22 కోట్లు

వైజాగ్ - 0.58 కోట్లు

తూర్పు గోదావరి - 0.29 కోట్లు

పశ్చిమ గోదావరి - 0.24 కోట్లు

కృష్ణా - 0.30 కోట్లు

గుంటూరు - 0.29 కోట్లు

నెల్లూరు - 0.26 కోట్లు

మొత్తం కలెక్షన్స్ - 5.55 కోట్లు

5 రోజుల మొత్తం కలెక్షన్స్ చూసుకుంటే ఇలా ఉన్నాయి.

నైజాం - 37.75 కోట్లు

సీడెడ్ - 20.63 కోట్లు

వైజాగ్ - 10.21 కోట్లు

తూర్పు గోదావరి - 6.46 కోట్లు

పశ్చిమ గోదావరి - 5.15 కోట్లు

కృష్ణా - 5.79 కోట్లు

గుంటూరు - 8.73 కోట్లు

నెల్లూరు - 3.92 కోట్లు

మొత్తం 5 రోజుల కలెక్షన్ - 98.64 కోట్లు