Begin typing your search above and press return to search.

గ్యాప్ దొరికినప్పుడల్లా కుమ్మేస్తున్నావ్ 'దేవర'

ఇటీవల విడుదలైన హిందీ సినిమాలు 'జిగ్రా' మరియు 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' అనుకున్నంత పాజిటివ్ టాక్ అందుకోలేదు. దీంతో హిందీ రాష్ట్రాల్లో 'దేవర'కు మంచి ఫలితం దక్కినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   16 Oct 2024 12:29 PM GMT
గ్యాప్ దొరికినప్పుడల్లా కుమ్మేస్తున్నావ్ దేవర
X

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో మరో ఘన విజయంగా నిలిచిన చిత్రం 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదట కొంత నెగిటివ్ హైప్ తోనే విడుదలైంది. విడుదల కాగానే ఒక రేంజ్ లో నెగిటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. కానీ వాటన్నింటినీ దాటుకుంటూ సినిమా భారీ వసూళ్లు సాదించింది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. ఇక గ్యాప్ దొరికినప్పుడల్లా కుమ్మేస్తోంది.

ఇప్పటివరకు ఇండియాలో ఈ సినిమా రెండు వారాల్లో దాదాపు రూ. 295 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సక్సెస్ వెనుక అదృష్టం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. టాలీవుడ్ లో ఎలాంటి పోటీ లేదు. దసరా సెలవులు కూడా చక్కగా హెల్ప్ అయ్యాయి. మొన్నటి వీకెండ్ సినిమాలు కూడా దేవర ముందు నిలబడలేకపోయాయి. ముఖ్యంగా నార్త్ లో దేవర లక్కు మామూలుగా లేదు.

ఇటీవల విడుదలైన హిందీ సినిమాలు 'జిగ్రా' మరియు 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' అనుకున్నంత పాజిటివ్ టాక్ అందుకోలేదు. దీంతో హిందీ రాష్ట్రాల్లో 'దేవర'కు మంచి ఫలితం దక్కినట్లు తెలుస్తోంది. అసలు 'జిగ్రా' చిత్రంకు ఎంత ప్రమోషన్ చేసినా, ప్రేక్షకులను ఆ మూవీ ఆకట్టుకోలేకపోయింది. దానికి తోడు, 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' సినిమా కూడా నెగటివ్ రివ్యూలు అందుకోవడంతో, ఆ సినిమాలకు డిమాండ్ లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలో హిందీ మార్కెట్ లో 'దేవర' కోసం ఒక మంచి అవకాశం ఏర్పడింది. నార్త్ జనాలు దేవర చూసేందుకు ఎగబడడంతో సినిమాకు హిందీ రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు వచ్చాయి. దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే, 'దేవర' మొదటి నుంచే అంచనాలు మేరకు రాణించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కర్ణాటకలో కూడా మంచి వసూళ్లు రాబడుతుండగా, తమిళనాడు మరియు కేరళలో మాత్రం కలెక్షన్స్ కొంత బాగానే ఉన్నాయి. ఇక గ్లోబల్ లెవల్ లో ఈ సినిమా రూ. 400 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. కానీ మేకర్స్ 500 కోట్ల పోస్టర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ మార్కెట్ లో 'దేవర' సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది.

హిందీ రాష్ట్రాల్లో 'దేవర'కి మంచి క్రేజ్ రావడం, అక్కడి స్థానిక సినిమాలు వర్కౌట్ అవ్వకపోవడం వల్లే ఈ సినిమా మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తానికి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా ఎదురుచూసిన 'దేవర' సినిమా విజయవంతం కావడం, రెండవ భాగం కోసం ఆసక్తి పెంచడం వంటి అంశాలు సినిమా సక్సెస్ లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. 'దేవర' రెండో భాగం కూడా ఇలాగే బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే మరొక రికార్డ్ అందికునే అవకాశం ఉంటుంది.