Begin typing your search above and press return to search.

దేవర మూవీ.. అసలు హైలైట్స్ ఇవే

‘దేవర’ చిత్రంలో కుస్తీ ఫైట్, అండర్ వాటర్ సీన్ హైలైట్ గా ఉంటాయంట. అలాగే హాఫ్ మూన్ సముద్రం ఫైట్ సీన్ విజువల్ గా గూస్ బాంబ్స్ క్రియేట్ చేస్తుందని టాక్.

By:  Tupaki Desk   |   22 Sep 2024 4:08 AM GMT
దేవర మూవీ.. అసలు హైలైట్స్ ఇవే
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ‘దేవర’ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. వరల్డ్ వైడ్ గా ఐదు ఇండియన్ భాషలలో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ మూవీపై వరల్డ్ వైడ్ గా భారీ హైప్ నెలకొని ఉంది. కచ్చితంగా ఎన్టీఆర్ కెరియర్ లోనే ‘దేవర’ బెస్ట్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలనే ఆసక్తి అందరిలో ఉంది. నార్త్ అమెరికాలో అయితే అడ్వాన్స్ బుకింగ్స్ జెట్ స్పీడ్ తో నడుస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయనున్నారు. మొదటి రోజు 100 కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో ‘దేవర’ చేరడం అయితే గ్యారెంటీ అని భావిస్తున్నారు. ఆపై ఎంత కలెక్ట్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టాప్ 5 జాబితాలో ఉన్న హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని ‘దేవర’ ఎంత వరకు అందుకుంటుందనేది చూడాలనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

మరోవైపు ఆదివారం ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తారక్ మాటల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే మూవీ సెకండ్ ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతోంది. దానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హైలైట్ అంశాల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంటరెస్టింగ్ ప్రచారం జరుగుతోంది.

‘దేవర’ చిత్రంలో కుస్తీ ఫైట్, అండర్ వాటర్ సీన్ హైలైట్ గా ఉంటాయంట. అలాగే హాఫ్ మూన్ సముద్రం ఫైట్ సీన్ విజువల్ గా గూస్ బాంబ్స్ క్రియేట్ చేస్తుందని టాక్. ఆయుధ పూజ సాంగ్, ఎన్టీఆర్ మరో క్యారెక్టర్ లుక్, చుట్టమల్లే, ఫియర్ సాంగ్స్ వైబ్ మూవీకి రిచ్ లుక్ తీసుకొచ్చి ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేయడం గ్యారెంటీ అంటున్నారు. ఓవరాల్ గా సినిమా చూసినంత సేపు చాలా అంశాలు ప్రేక్షకులని ముగ్ధుల్ని చేస్తాయని భావిస్తున్నారు.

అండర్ వాటర్ సీక్వెన్స్ గురించి ఎన్టీఆర్ కూడా ఇప్పటికే ప్రమోషన్స్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మూవీలో ఆ ఫైట్ సీక్వెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలనే క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. కచ్చితంగా ‘దేవర’ మూవీ వైడ్ వైడ్ గా సెన్సేషన్ కలెక్షన్స్ ని అందుకోవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంచనాలని ఏ మేరకు అందుకుంటాడు అనేది వేచి చూడాలి.