Begin typing your search above and press return to search.

దేవ‌ర-హిందీ ప్ర‌మోష‌న్స్‌లో టాప్ స్టార్లు

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తొలి సోలో పాన్ ఇండియ‌న్ చిత్రం `దేవ‌ర‌-1` ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత భారీగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

By:  Tupaki Desk   |   10 Sep 2024 4:21 AM GMT
దేవ‌ర-హిందీ ప్ర‌మోష‌న్స్‌లో టాప్ స్టార్లు
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తొలి సోలో పాన్ ఇండియ‌న్ చిత్రం `దేవ‌ర‌-1` ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత భారీగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈనెలాఖ‌రులోనే రిలీజ్. ఈ సంద‌ర్భంగా ప్ర‌చారంలో కొర‌టాల బృందం స్పీడ్ చూపిస్తోంది. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లో మాత్ర‌మే కాదు.. ఈసారి హిందీ ప్ర‌మోష‌న్స్‌లోను తార‌క్- కొర‌టాల అండ్ టీమ్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

అయితే హిందీ ప్ర‌మోష‌న్స్ కి ఎవ‌రెవ‌రు స‌హ‌క‌రిస్తున్నారు? అంటే.. ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ సహా సందీప్ రెడ్డి వంగా కూడా సాయ‌ప‌డుతున్నారు. అలాగే ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ కోస్టార్ ఆలియాభ‌ట్ కూడా దేవ‌ర ప్ర‌మోష‌న్స్ కోసం బ‌రిలో దిగుతోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఈ సినిమాలో న‌టించిన స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, జాన్వీ క‌పూర్ ప్ర‌చారం కూడా అక్క‌డ అద‌న‌పు బూస్ట్ ని ఇవ్వ‌నుంది. ప్ర‌స్తుతం సందీప్ వంగా ముంబైలో ఉన్నారు. అక్క‌డ తార‌క్ బృందానికి ప్ర‌మోష‌న్స్ ప‌రంగా సాయ‌ప‌డనున్నార‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే వార్ 2లో ఎన్టీఆర్ కొలీగ్ అయిన హృతిక్ రోష‌న్ కూడా దేవ‌ర-1కి ప్ర‌చార సాయం చేస్తార‌ని అంతా భావిస్తున్నారు. తార‌క్ నోరు విప్పి అడిగితే హృతిక్ కాద‌ని అన‌డు. ఒక‌వేళ గ్రీక్ గాడ్ ప్ర‌చారం చేస్తే అది హిందీ బెల్ట్ లో వ‌సూళ్ల‌కు అద‌న‌పు బూస్ట్ ని ఇస్తుంద‌ని భావిస్తున్నారు.

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో

దేవ‌ర‌-హిందీ ప్రమోషన్స్‌లో పాల్గొనడానికి ఎన్టీఆర్ ఈరోజు ఉదయాన్నే ముంబైకి చేరుకున్నాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో అతడు కలుసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తర్వాత తారక్ అతడి సహనటులు సైఫ్ అలీ ఖాన్ - జాన్వీ కపూర్‌లతో కలిసి కపిల్ శర్మ `ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ` షోలో ప్రత్యేక ప్రచార ఎపిసోడ్‌లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ క్యాజువ‌ల్ గా క‌నిపించ‌గా, సైఫ్ ఫార్మల్ వేర్‌లలో డాషింగ్‌గా కనిపించారు. జాన్వీ నీలిరంగు దుస్తుల్లో అద్భుతంగా కనిపించింది. సెట్‌లో ఉన్న ఎన్టీఆర్, సైఫ్ , జాన్వీల కొన్ని ఫోటోలు ఇంటర్నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి.

దేవర థియేట్రికల్ ట్రైలర్ రేపు సాయంత్రం 5:04 గంటలకు విడుదల కానుంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. స్వ‌రాల్ని అనిరుధ్ రవిచందర్ స్వరపరిచారు. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో థియేటర్లలోకి రానుంది.