Begin typing your search above and press return to search.

దేవర.. పూనకాలు తెప్పించే యాక్షన్ డోస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది.

By:  Tupaki Desk   |   9 Sep 2024 5:54 AM GMT
దేవర.. పూనకాలు తెప్పించే యాక్షన్ డోస్
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కచ్చితంగా దేవర మూవీ వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కొరటాల శివ ఈ చిత్రాన్ని చాలా ఎఫర్ట్స్ పెట్టి రెడీ చేస్తున్నారు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసాయి.

ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా దేవర చిత్రం కథని చెప్పబోతున్నారు. దేవర సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటించారు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని టీజర్ తో స్పష్టం అయ్యింది.

ఇదిలా ఉంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్ మధ్య వచ్చే పోరాట ఘట్టాలు చాలా అద్భుతంగా ఉంటాయంట. క్లైమాక్స్ ఎపిసోడ్ లో అయితే ఇద్దరి మధ్య ముష్టియుద్ధం ఉంటుందంట. ఈ సీన్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందనే మాట వినిపిస్తోంది. క్లైమాక్స్ ఫైట్ లో ఎన్టీఆర్ షర్టు లేకుండా కనిపిస్తాడంట. మల్ల యుద్ధం తరహాలో ఈ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందంట. ఈ ప్రచారం వాస్తవం అయితే మాత్రం సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోతాయి.

ఈ సీన్ చూసిన తర్వాత ఫ్యాన్స్ కి పూనకాలు రావడం గ్యారెంటీ అని సినీవిశ్లేషకులు అంటున్నారు. గతంలో టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ ఒక సాంగ్ లో షర్టు లేకుండా కనిపించారు. అరవింద సమేత లో కూడా ఫిట్నెస్ తో స్టన్ అయ్యేలా కనిపించాడు. ఇక దేవర సినిమాలో మాత్రం అంతకుమించి అనేలా క్లైమాక్స్ ఫైట్ షర్టు లేకుండా కండలు తిరిగిన శరీరంతో ఎన్టీఆర్ కనిపిస్తాడనే మాట వినిపిస్తోంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కంప్లీట్ అయిపొయింది. వరల్డ్ వైడ్ గా 350-400 కోట్ల మధ్యలో బిజినెస్ జరిగిందని టాక్. జాన్వీ కపూర్ ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ లో జాన్వీ కపూర్ గ్లామర్ షో ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది.