Begin typing your search above and press return to search.

జాన్వీ క‌పూర్ కిది గ్రాండ్ లాంచింగ్!

కానీ ఇవేవి జాన్వీ ఖాతాలో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌గా క‌నిపించ‌వు. తొలి రోజు వంద కోట్లు తెచ్చిన సినిమాల జాబితాలోనూ ఉండ‌వు.

By:  Tupaki Desk   |   29 Sep 2024 4:30 PM GMT
జాన్వీ క‌పూర్ కిది గ్రాండ్ లాంచింగ్!
X

అతిలోక సుంద‌రి శ్రీదేవి కుమార్తె జాన్వీ క‌పూర్ కి `దేవ‌ర` ఇండియ‌న్ బెస్ట్ లాంచింగ్ మూవీ అయిందా? మాతృభాష హిందీ ని మించి తెలుగులోనే అది సాధ్య‌మైందా? అంటే అవున‌నే అనిపిస్తుంది. జాన్వీ బాలీవుడ్ లో `ధ‌డ‌క్` తో చిత్ర ప‌రిశ్ర‌మ‌కి ఎంట్రీ ఇచ్చిన‌ సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత `గుంజ‌న్ స‌క్సేనా`లో న‌టించింది. `రూహీ`, `గుడ్ ల‌క్ జెర్రీ`, `మిలీ`, `బ‌వాల్`, `ఉల‌జ్`, `మిస్ట‌ర్ అండ్ మిస్ట‌ర్స్ మ‌హి` ఇలా కొన్ని సినిమాలు చేసింది.

కానీ ఇవేవి జాన్వీ ఖాతాలో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌గా క‌నిపించ‌వు. తొలి రోజు వంద కోట్లు తెచ్చిన సినిమాల జాబితాలోనూ ఉండ‌వు. కానీ టాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన `దేవ‌ర` మాత్రం జాన్వీ కెరీర్ లోనే ఓ గొప్ప చిత్రంగా నిలిచి పోతుంది. ఈ సినిమా తొలి రోజు 170 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇలాంటి ఓపెనింగ్ జాన్వీ చూడాలంటే? అది ఇప్ప‌ట్లో జ‌రిగేది కాదు. అక్క‌డ పెద్ద పెద్ద స్లార్ల‌కే ఇంకా సాధ్యం కాలేదు.

అలాంటిది జాన్వీకి ఓ తెలుగు సినిమాతో ఈ గౌర‌వం ద‌క్క‌డం ఆమె చేసుకున్న అదృష్టంగా చెప్పాలి. ఇది జాన్వీ మామ్ శ్రీదేవి అందించిన గిప్ట్ గా చెప్పాలి. శ్రీదేవి బ్రాండ్ తోనే జాన్వీకి ఈ అవ‌కాశం వ‌చ్చింది. లేదంటే ప‌నిగ‌ట్టుకుని జాన్వీనే ఎందుకు తీసుకుంటారు. అల‌నాటి అందాల న‌టి శ్రీదేవికి తెలుగు సినిమాతో ఉన్న అనుబంధం గురించి తెలిసిందే.

జాన్వీ ఆమె కుమార్తె అవ్వ‌డం తో కొర‌టాల- ఎన్టీఆర్ జాన్వీ అయితే ది బెస్ట్ గా ఉంటుంద‌ని ఎంపిక చేసారు. ఇప్పుడా సినిమా స‌క్సెస్ తో జాన్వీకి మంచి గుర్తింపు ద‌క్కుతుంది. ఆమె పాత్ర‌కు అంత‌గా ప్రాధాన్య‌త లేక‌పోయినా వ‌సూళ్ల ప‌రంగా `దేవ‌ర` దూకుడుతో ఇది సాద్య‌మైంది. అయితే ఈసినిమా బాలీవుడ్ కి మాత్రం అంత‌గా క‌నెక్ట్ అవ్వ‌లేదు.