Begin typing your search above and press return to search.

దేవర.. స్టూడెంట్ నెంబర్ వన్ సెంటిమెంట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

By:  Tupaki Desk   |   17 Sep 2024 3:43 AM GMT
దేవర.. స్టూడెంట్ నెంబర్ వన్ సెంటిమెంట్
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ నుంచి ఆరేళ్ళ తర్వాత సోలోగా వస్తోన్న సినిమా ఇదే కావడంతో ప్రేక్షకులలో క్యూరియాసిటీ ఉంది. ఇప్పటి వరకు మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ కొంత వరకు హైప్ క్రియేట్ చేయగలిగాయి.

వాటికి మిశ్రమ స్పందన వచ్చిన కూడా పబ్లిక్ అటెన్షన్ ని గ్రాబ్ చేశాయి. దీంతో నార్త్ అమెరికాలో ‘దేవర’ మూవీకి భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇండియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ సాలిడ్ గా ఉంటాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రాణం పెట్టి ఈ సినిమా కోసం వర్క్ చేశారు. ‘దేవర’ మూవీలో తారక్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఆ రెండు పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉంటాయనే మాట వినిపిస్తోంది.

కొరటాల శివ ఈ సినిమాలో ఎవ్వరు ఎక్స్ పెక్ట్ చేయని ఒక ట్విస్ట్ పెట్టారంట. కచ్చితంగా ఆ ట్విస్ట్ అందరిని సర్ప్రైజ్ చేస్తుందనే ప్రచారం నడుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ‘దేవర’ మూవీ రిలీజ్ డేట్ గురించి ఓ ఇంటరెస్టింగ్ విషయం రివీల్ అయ్యింది. ఎన్టీఆర్ హీరోగా మొదటి సక్సెస్ ని ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాతో అందుకున్నారు. 2001 సెప్టెంబర్ 27న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మరల 23 ఏళ్ళ తర్వాత అదే డేట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫస్ట్ సోలో పాన్ ఇండియా మూవీ ‘దేవర’ రిలీజ్ అవుతోంది.

‘స్టూడెంట్ నెంబర్ 1’ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే కచ్చితంగా ‘దేవర’ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ‘దేవర’ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకోవడంతో పాటు ఏకంగా 1000 కోట్ల కలెక్షన్స్ అందుకోవాలని కోరుకుంటున్నారు. తారక్ కి బాగా సెంటిమెంట్ అయినా నెంబర్ 9 కలిసొచ్చే విధంగా డేట్ ఫిక్స్ చేసి దేవర సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

కచ్చితంగా ఆయనకి ‘దేవర’ మంచి సక్సెస్ ని అందిస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ఈ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొని సినిమాకి హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జాన్వీ కపూర్ కి ఇది తెలుగు డెబ్యూ మూవీ. దీంతో ఈ బ్యూటీ ‘దేవర’ మూవీపైన చాలా హోప్స్ పెట్టుకుంది. కొరటాల శివకి కూడా ‘దేవర’తో కచ్చితంగా సాలిడ్ సక్సెస్ కావాలి.