దేవర జపాన్ ప్రమోషన్స్‌కు రంగం సిద్ధం
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఏ రేంజ్ లో సూపర్ హిట్ గా నిలిచిందో తెలిసిందే.
By: Tupaki Desk | 25 Feb 2025 9:33 AM GMTమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఏ రేంజ్ లో సూపర్ హిట్ గా నిలిచిందో తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా, సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.
గతేడాది సెప్టెంబర్ లో రిలీజైన ఈ సినిమా రాజమౌళి సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేసి హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఇప్పుడు మార్చి 28న జపాన్ లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ రంగంలోకి దిగి ఆ చిత్ర ప్రమోషన్స్ ను మొదలుపెట్టాడు. జపాన్ మీడియాకు ఎన్టీఆర్ వర్చువల్ గా స్పెషల్ ఇంటర్వ్యూలిస్తున్నాడు.
తెలుగు సినిమాలకు జపాన్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే చాలా సినిమాలు అక్కడ రిలీజై ఘన విజయాన్ని సాధించాయి. గతంలో ఆర్ఆర్ఆర్ తో పాటూ పలు సినిమాలు జపాన్ భాషలో రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో జూ. ఎన్టీఆర్ దేవర సినిమాను కూడా జపాన్ లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేశారు.
అయితే తెలుగు సినిమాలు జపాన్ మీద ఫోకస్ చేయడానికి కారణముంది. ఇండియన్ సినిమాలకు జపాన్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటివరకు జపాన్ లో టాప్1లో ఆర్ఆర్ఆర్ ఉండగా, ఆ తర్వాత ముత్తు, బాహుబలి2, త్రి ఇడియట్స్ ఉన్నాయి. ఇప్పుడు దేవరకు సరైన రీతిలో ప్రమోషన్స్ చేసి ఈ సినిమాను టాప్ లో నిలపాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. అందుకే నెల రోజుల ముందు నుంచే ఎన్టీఆర్ ఆన్‌లైన్ ద్వారా ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు.
జపాన్ దేశంలో పైరసీ నిషేధం కావడంతో మిగిలిన దేశాల మాదిరిగా అక్కడ ఓటీటీ కంటెంట్ మొత్తం ఉండదు. అన్నీ గవర్నమెంట్ కంట్రోల్ లోనే ఉంటాయి. అందుకే ఎంత లేటైనా సరే మన సినిమాలను ఆ దేశంలో రిలీజ్ చేయాలని చూస్తుంటారు దర్శకనిర్మాతలు. దేవరను ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ వచ్చే నెల 22న జపాన్ వెళ్లనున్నట్టు చిత్ర బృందం తెలిపింది.