Begin typing your search above and press return to search.

కొరటాల.. ముందే ఆ పని చేయాల్సిందిగా!

కొరటాలతో ఒక్క మూవీ అయినా చేయాలనేంతగా మారిపోయారు! అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేశారు.

By:  Tupaki Desk   |   4 Oct 2024 11:30 PM GMT
కొరటాల.. ముందే ఆ పని చేయాల్సిందిగా!
X

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ.. హిట్స్ కొడుతూ.. ఒక్కసారిగా ఫేమ్ సంపాదించుకున్నారు. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కొరటాలతో ఒక్క మూవీ అయినా చేయాలనేంతగా మారిపోయారు! అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేశారు. చిరు, కొరటాల ప్రాజెక్ట్ అంటూ అనౌన్స్మెంట్ రావడంతో అంతా భారీ అంచనాలు పెటుకున్నారు.

వాటిని తలకిందులు చేస్తూ.. ఆచార్య డిజాస్టర్ గా మారింది. ఆ తర్వాత సినిమాపై అనేక రూమర్స్ వినిపించాయి. వాటిపై కొరటాల ఇటీవల క్లారిటీ కూడా ఇచ్చారు. రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన దేవర పార్ట్-1 మంచి హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. కొందరు మిక్స్ డ్ రివ్యూస్ ఇచ్చినా.. వసూళ్లపై అవి ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేదు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో నటించిన విషయం తెలిసిందే.

అయితే సినిమా విడుదలకు ముందు మేకర్స్ అన్ని సాంగ్స్ రిలీజ్ చేయగా.. చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. అందులో దావూదీ సాంగ్ వేరే లెవెల్ లో మెప్పించింది. తారక్, జాన్వీ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ కు ఫిదా అయ్యారు. విడుదలకు ముందు ఫుల్ హైప్ ఇచ్చిన దావూదీ పాట దేవర చిత్రంలో లేకపోవడంతో కొందరు ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. దీంతో మేకర్స్.. సాంగ్ ను సినిమాలో యాడ్ చేశారు. శుక్రవారం నుంచి అన్ని స్క్రీన్స్‌ లో పాటను ప్రదర్శిస్తున్నారు. ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.

అందుకు సంబంధించిన క్లిప్స్.. సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఫుల్ గా రెస్పాండ్ అవుతున్నారు. అయితే సెకండాఫ్ లో కొరటాల మార్క్ మిస్ అయిందని సినిమా రిలీజ్ అయ్యాక కొందరు రివ్యూలు ఇచ్చారు. ఎనర్జిటిక్ మూమెంట్ అవసరమని అభిప్రాయపడ్డారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇప్పుడు దావూదీ సాంగ్ ను యాడ్ చేసిన తర్వాత.. మాగ్జిమమ్ సెట్ అయిందని చెబుతున్నారు. మేకర్స్ కాస్త ఆలస్యమైనా పెర్ఫెక్ట్ నిర్ణయం తీసుకున్నారని కామెంట్లు పెడుతున్నారు.

అదే సమయంలో సినిమా ఫైనల్ కాపీలోనే కొరటాల శివ.. దావూదీ సాంగ్ ను యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేదని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. నిడివి ఎక్కువ అయిందని సాంగ్ ను అనవసరంగా కట్ చేశారని అంటున్నారు. దీంతో కొరటాల శివ.. బెస్ట్ ఛాన్స్ మిస్ చేసుకున్నారని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు దావూదీ సాంగ్ ను యాడ్ చేయడంతో అటు సినీ ప్రియులు, ఇటు అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.