Begin typing your search above and press return to search.

దేవర.. ఆ విషయాన్ని పట్టించుకోవక్కర్లేదేమో!

రిలీజ్ కు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన దేవర.. వాటిని దాదాపు అందుకుంది.

By:  Tupaki Desk   |   9 Oct 2024 5:30 PM GMT
దేవర.. ఆ విషయాన్ని పట్టించుకోవక్కర్లేదేమో!
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఆరేళ్ల తర్వాత సోలోగా దేవర పార్ట్ -1తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. జనతా గ్యారేజ్ తర్వాత మాస్ డైరెక్టర్ కొరటాల శివతో దేవర మూవీకి గాను మరోసారి తారక్ చేతులు కలిపారు. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటించగా.. సైఫ్ అలీఖాన్ విలన్‌ గా కనిపించారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు.

రిలీజ్ కు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన దేవర.. వాటిని దాదాపు అందుకుంది. కానీ వాటితో సంబంధం లేకుండా భారీ వసూళ్లను సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. బాలీవుడ్, ఓవర్సీస్ లో కూడా అదరగొడుతోంది. దసరా సెలవులు కావడంతో ఇప్పటికీ దూసుకెళ్తోంది. విడుదలైన తొలి వారంలోనే మేకర్స్ కు లాభాలు తెచ్చిపెట్టిన దేవర.. 12వ రోజు కూడా మంచి కలెక్షన్లు సాధించింది. వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది.

అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు దేవర మూవీకి సంబంధించి ఒక కొత్త చర్చ ఊపందుకుంది. టాలీవుడ్ కు చెందిన బడా హీరోలు ఎవరూ దేవరకు మద్దతుగా లేక ప్రశంసిస్తూ ట్వీట్స్ చేయలేదని నెటిజన్లు చెబుతున్నారు. నార్మల్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు.. తరచూ వివిధ చిత్రాల కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. మేకర్స్, క్యాస్టింగ్ కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్లు పెడుతుంటారు. అల్లు అర్జున్ కూడా అప్పుడప్పుడు పలు చిత్రాలకు రివ్యూస్ ఇస్తుంటారు.

కానీ వాళ్ళిద్దరూ దేవర మూవీపై ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. ఆర్ఆర్ఆర్ మూవీలో తారక్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న రామ్ చరణ్.. దేవర రిలీజ్ కు ముందు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు. కానీ మూవీ విడుదల అయ్యాక ఆయన ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. అనేక చిత్రాలను అభినందించే మెగాస్టార్ చిరంజీవి కూడా దేవర మూవీపై స్పందించలేదు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు.

అయితే టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఎక్కువగా చిన్న చిత్రాలకు స్పందిస్తుంటారు. వారిని ప్రోత్సహిస్తుంటారు. దేవర చిన్న మూవీ ఏం కాదు.. బడా హీరో చిత్రమే కదా! కాబట్టి హీరోలు ఎవరూ స్పందించకపోయినా.. బాక్సాఫీస్ వద్ద తన పని చేసుకుని పోతుంది మూవీ. దానికి తోడు.. దేవర ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఏదేమైనా కంటెంట్ బాగుంటే.. ఎవరు రివ్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా మౌత్ టాక్ తోనే సినిమా దూసుకుపోవడం పక్కా అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. దీంతో ా విషయం పెద్దగా పట్టించుకోవక్కర్లేదని నెటిజన్లు చెబుతున్నారు.