మరింత గ్రిప్పింగ్‌గా దేవర జపాన్ ట్రైలర్
మాస్ డైరెక్టర్ కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర గతేడాది సెప్టెంబర్ లో రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 27 Feb 2025 6:16 AM GMTమాస్ డైరెక్టర్ కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర గతేడాది సెప్టెంబర్ లో రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. దేవర మూవీ వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్లకు పైగానే రాబట్టింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటూ, ఓవర్సీస్ లో కూడా మంచి పేరే తెచ్చుకున్నాడు.
కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోకి వచ్చాక కూడా దేవర తన సత్తా చాటాడు. నెక్ట్స్ లెవెల్ వ్యూస్ తో ఎన్టీఆర్ దేవర ఓటీటీలో దూసుకెళ్లింది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు. సౌత్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన దేవర ఇప్పుడు జపాన్ రిలీజ్ కు ముస్తాబవుతుంది.
మార్చి లో దేవర జపాన్ లో రిలీజ్ కానుంది. ఆల్రెడీ జపాన్ రిలీజ్ కోసం ఎన్టీఆర్ ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశాడు. జపాన్ లోని ఫ్యాన్స్ తో, అక్కడి మీడియాతో ఎన్టీఆర్ వర్చువల్ గా మాట్లాడుతూ దేవర ను ప్రమోట్ చేస్తున్నాడు. మార్చి 28న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన జపాన్ వెర్షన్ ట్రైలర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.
దేవర తెలుగు ట్రైలర్ కంటే జపాన్ వెర్షన్ ట్రైలర్ మరింత గ్రిప్పింగ్ గా కట్ చేశారు. ఎర్ర సముద్రం తెగ కథ గురించి చెప్తూ మొదలైన దేవర ట్రైలర్, లాస్ట్ తో దేవర థీమ్ తో ఎండ్ అయింది. ట్రైలర్ కట్ విషయంలో మాత్రం మేకర్స్ సక్సెస్ అయినట్టే. తెలుగు వెర్షన్ లోనే జపాన్ సబ్ టైటిల్స్ తో మార్చి 28న దేవర జపాన్ లో రిలీజ్ కాబోతుంది.
సినిమాను డైరెక్ట్ గా ప్రమోట్ చేయడానికి ఎన్టీఆర్ మార్చి 22న జపాన్ వెళ్లనున్నాడు. తారక్ తో పాటూ దేవర డైరెక్టర్ కొరటాల శివ కూడా ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మరి దేవర జపాన్ లో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం వార్2 చేస్తున్న ఎన్టీఆర్, త్వరలోనే ఆ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ లో జాయిన్ కానున్నాడు.