Begin typing your search above and press return to search.

దేవర : మొదటి నుంచి చివరి వరకు అదే చేశారట!

ఆ ఇంటర్వ్యూ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరదాగా సాగిన ఆ చిట్‌ చాట్‌ లో ఎన్టీఆర్‌, కొరటాల శివ లు చాలా విషయాలను పంచుకున్నారు.

By:  Tupaki Desk   |   21 Sep 2024 6:54 AM GMT
దేవర : మొదటి నుంచి చివరి వరకు అదే చేశారట!
X

ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక 'దేవర' చిత్రం ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ముంబై, చెన్నై ల్లో సినిమా ఈవెంట్స్ నిర్వహించడం ద్వారా అక్కడ ప్రమోట్‌ చేసిన ఎన్టీఆర్‌, కొరటాల శివ తాజాగా యంగ్‌ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌ సేన్‌ లకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరదాగా సాగిన ఆ చిట్‌ చాట్‌ లో ఎన్టీఆర్‌, కొరటాల శివ లు చాలా విషయాలను పంచుకున్నారు.

సినిమా షూటింగ్‌ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డట్లుగా ఎన్టీఆర్‌, కొరటాల శివ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఒక సన్నివేశం ను చిత్రీకరించే సమయంలో ఎండకు చనిపోతానా అన్నంత భయం వేసిందని ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చాడు. ఇక ఆయుధ పూజకు సంబంధించిన షూటింగ్‌ ను మొదటి షెడ్యూల్‌ లో అనుకుంటే చివరి షెడ్యూల్‌ వరకు చేస్తూనే వచ్చాం. సినిమాకు అత్యంత కీలకం అయిన ఆ సీన్‌ ను ది బెస్ట్‌ గా చూపించాలనే ఉద్దేశ్యంతో చాలా వర్షన్ లు చిత్రీకరించాం. చివరకు ఆ ఆయుధ పూజ షాట్‌ పూర్తి చేసిన తర్వాతే గుమ్మడి కాయ కొట్టినట్టుగా చెప్పుకొచ్చారు.

సాధారణంగా సినిమాలో ఒకటి లేదా రెండు సీన్‌ లు మొదటి నుంచి చివరి వరకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి సన్నివేశం మాకు ఆయుధ పూజ సన్నివేశం అంటూ దర్శకుడు కొరటాల శివ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతిసారి ఏదో ఒక తప్పిదం లేదా టెక్నికల్‌ ఇష్యూ కారణంగా మళ్లీ మళ్లీ చిత్రీకరించినట్లు కొరటాల శివ పేర్కొన్నాడు. సినిమాలో ఆ సీన్ చూస్తున్నప్పుడు కచ్చితంగా ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అవ్వడం ఖాయం అంటూ ఎన్టీఆర్‌ అన్నాడు. మతం, కులం లేని వారు ఆయుధాలను తమ దేవుళ్లుగా భావించి చేసే పూజను ఈ సినిమా లో చక్కగా చూపించినట్లుగా ఎన్టీఆర్‌ తెలియజేశాడు.

ఆయుధ పూజ ను సినిమాలో చూస్తున్న సమయంలో ప్రేక్షకులు అంతా ఆశ్చర్యపోతారని మొదటి నుంచే యూనిట్‌ సభ్యులు చెబుతూ వస్తున్నారు. ఇటీవల ఈ ఆయుధ పూజ పాటను విడుదల చేయాలని భావించినా కొన్ని కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు ఆయుధ పూజ షూటింగ్‌ కు చాలా సమయం పట్టిందని చెప్పడం తో అసలు ఈ ఆయుధ పూజ ఏంటి అంటూ ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్ ల్లో ఆసక్తి పెరిగింది. సినిమాలో ఆయుధ పూజ ఎలా ఉంటుందా అనే ఆసక్తి పెరిగింది. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అన్ని వర్గాల వారిని మెప్పించే విధంగా సినిమా ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్‌ లో నందమూరి కళ్యాణ్‌ రామ్‌, మిక్కిలినేని సుధాకర్‌ లు కలిసి ఈ సినిమాను నిర్మించారు.