దేవర.. ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా...
ఫ్యాన్స్ బెన్ ఫిట్ షోలు అనేది రెండు దశాబ్దాల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో నడుస్తోంది.
By: Tupaki Desk | 17 Sep 2024 4:56 AM GMTఫ్యాన్స్ బెన్ ఫిట్ షోలు అనేది రెండు దశాబ్దాల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో నడుస్తోంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకి ఇలా బెన్ ఫిట్ షోలు వేసేవారు. ప్రత్యేకంగా ఫ్యాన్స్ కోసం మాత్రమే ఈ బెన్ ఫిట్ షోలు వేస్తారు. అర్ధరాత్రి ఒంటిగంటకి, ఉదయం నాలుగు గంటలకి ఇలాంటి బెన్ ఫిట్ షోలని థియేటర్స్ లో వేస్తారు. ఫ్యాన్స్ అసోసియేషన్ లో ఉన్నవారే ఈ బెన్ ఫిట్ షోల కోసం థియేటర్స్ లో ఒక షో బుక్ చేసుకుంటారు.
ఆ షో మొత్తానికి ఇన్ని లక్షలు అని డిస్టిబ్యూటర్స్ తో మాట్లాడుకుంటారు. డిస్టిబ్యూటర్స్ కూడా మంచి ధర చూసుకొని ఫ్యాన్స్ బెన్ ఫిట్ షోలు వేసుకోవడానికి అవకాశం ఇస్తారు. అయితే చారిటీ షోలుగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొని ఈ షోలని ఏర్పాటు చేస్తూ ఉంటారు. టికెట్ ధరలు కూడా వేలల్లో పెడతారు. అయితే డిస్టిబ్యూటర్స్ నేరుగా ఐదు షోలకి పర్మిషన్ తెచ్చుకుంటున్న తర్వాత ఫ్యాన్స్ బెన్ ఫిట్ షోలు చాలా వరకు తగ్గిపోయాయి. అలాగే టికెట్ ధరలు కూడా భారీగా పెంచుకోవడానికి ప్రభుత్వాలు పర్మిషన్ ఇస్తున్నాయి.
ఇది డిస్టిబ్యూటర్స్ కి అనుకూలిస్తుండటంతో ఇలాంటి ఫ్యాన్స్ బెన్ ఫిట్ షోలు పెద్దగా వేయడం లేదనే చెప్పాలి. ఈ ఏడాది ‘గుంటూరు కారం’ సినిమాకి కొన్ని చోట్ల ఇలాంటి ఫ్యాన్స్ బెన్ ఫిట్ షోలు పడ్డాయంట. అయితే ముందుగానే డిస్టిబ్యూషన్ ఆఫీస్ లోనే టికెట్ ధరలు ఫిక్స్ చేసి అమ్మారని టాక్. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాకి కూడా ఫ్యాన్స్ బెన్ ఫిట్ షోలు కన్ఫర్మ్ అయ్యాయనే ప్రచారం నడుస్తోంది.
ఇది ఎంత వరకు వాస్తవమో తెలియదు. అయితే ఈ సారి నేరుగా డిస్టిబ్యూటర్స్ ఈ ఫ్యాన్స్ బెన్ ఫిట్ షోల కోసం ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలని అనుకుంటున్నారంట. చారిటీ షోలుగా పేరు పెట్టి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటే డైరెక్ట్ గా థియేటర్స్ వద్దనే టికెట్ రేట్లు 1000, 2000 ధరలకు అమ్మొచ్చు. ఇలా అమ్మడం ద్వారా కలెక్షన్స్ కూడా భారీగా వస్తాయి. ఇది ఓవరాల్ గా మొదటి రోజు కలెక్షన్స్ లోకి వస్తుంది.
భారీ కలెక్షన్స్ రికార్డ్ చూపించుకుని ఛాన్స్ కూడా దొరుకుతుందనే మాట వినిపిస్తోంది. మరి సోషల్ మీడియాలో జరుగుతోన్న ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అనేది తెలియదు. ఒక వేళ వాస్తవమైన ప్రభుత్వం ఇలా భారీ ధరకి టికెట్లు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తుందా అనేది చెప్పలేం.