Begin typing your search above and press return to search.

దేవర హిందీ ఓపెనింగ్స్.. తారక్ పెద్ద స్కెచ్చే!

ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న దేవర మూవీ.. యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్ అందుకుంది.

By:  Tupaki Desk   |   12 Sep 2024 4:30 PM GMT
దేవర హిందీ ఓపెనింగ్స్.. తారక్ పెద్ద స్కెచ్చే!
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర పార్ట్-1 మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన సినిమాను అక్టోబర్ కు వాయిదా వేసిన మేకర్స్.. ఆ తర్వాత సెప్టెంబర్ కు ప్రీ పోన్ చేశారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా దేవరను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న దేవర మూవీ.. యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్ అందుకుంది. సినిమా రన్ టైమ్ 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లుగా తెలుస్తోంది. అయితే ఓవర్సీస్ లో దేవర పెద్ద ఎత్తున రిలీజ్ కానుండగా.. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండా వన్ మిలియన్ ప్రీ సేల్స్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా దేవర కూడా రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే తెలుగు రాష్ట్రాల్లో దేవరపై ఉన్న క్రేజ్ ను చూసుకుంటే.. భారీ ఓపెనింగ్స్ రాబట్టడం పక్కా అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. వేరే లెవల్ లో తొలి రోజు కలెక్షన్స్ రానున్నాయి. కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ లో కూడా మోస్తరు వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. మరి బాలీవుడ్ పరిస్థితేంటి అన్నది ఇప్పుడు అసలు విషయం. అక్కడ దేవర ఎలాంటి వసూళ్లు సాధిస్తుందోనని అంతా మాట్లాడుకుంటున్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీతో నార్త్ లో కూడా తారక్ మంచి క్రేజ్ దక్కించుకున్నారు. దానికి తోడు మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ లను బాలీవుడ్ ఆడియన్స్ ఎప్పుడు బాగానే ఆదరిస్తున్నారు. సినిమాలో బాలీవుడ్ తారలు జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ కూడా ఉన్నారు. దీంతో దేవర బీ టౌన్ లో మంచి ఓపెనింగ్స్ సాధిస్తుందని చెబుతున్నారు. అదే సమయంలో మూవీ కంటెంట్ ముఖ్య పాత్ర పోషిస్తుందని అంటున్నారు.

ఇక తారక్ కూడా బాలీవుడ్ ప్రమోషన్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ముంబైలో జరిపారు. బీటౌన్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో చిట్ చాట్ లో పాల్గొన్నారు. క్రేజీ డైరెక్టర్ తో సందీప్ వంగాతో ఇంటర్వ్యూ చేశారు. అలా పక్కా ప్లాన్ తో బీ టౌన్ లో ప్రమోట్ చేస్తున్నారు. మరిన్ని విధాలుగానూ సందడి చేయనున్నారు. మరి బాలీవుడ్ లో దేవర ఎలాంటి ఓపెనింగ్స్ సాధిస్తుందో? ప్రమోషన్స్ ఎలా హెల్ప్ అవుతాయో వేచి చూడాలి.