Begin typing your search above and press return to search.

466 నాటౌట్… దేవర కలెక్షన్స్ జోరు

ఇప్పటి వరకు ‘దేవర’ మూవీ 10 రోజుల్లో 466 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా వసూళ్లు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు.

By:  Tupaki Desk   |   7 Oct 2024 7:28 AM GMT
466 నాటౌట్… దేవర కలెక్షన్స్ జోరు
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా కలెక్షన్స్ జోరు మాత్రం తగ్గలేదు. డీసెంట్ వసూళ్లతో థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అయితే ‘దేవర’ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. దసరా ఫెస్టివల్ హాలిడేస్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయని చెప్పొచ్చు. ‘దేవర’ తో పోల్చుకుంటే మిగిలిన సినిమాలు ఏవీ కూడా అంత ఎఫెక్టివ్ గా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయడం లేదు. డైలీ 30 నుంచి 50 శాతం వరకు థియేటర్స్ ఆక్యుపెన్సీ అవుతున్నాయనే మాట వినిపిస్తోంది.

ఇప్పటి వరకు ‘దేవర’ మూవీ 10 రోజుల్లో 466 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా వసూళ్లు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు. బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో మూవీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తోందని మేకర్స్ తెలియజేశారు. నిజానికి మొదటి రోజు ఈ సినిమాకి వచ్చిన టాక్ చూసుకుంటే భారీ నష్టాలు తప్పవని అందరూ భావించారు. అయితే నెగిటివ్ రివ్యూలు వచ్చిన కూడా ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ పట్టం కట్టారు.

మూవీలో ఉన్న చిన్న చిన్న లోపాలని పక్కనే పెట్టి కథని, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ని బాగా కనెక్ట్ అయ్యారు. అలాగే కంటెంట్ ని పూర్తిగా ఒక ఫిక్షనల్ ప్రపంచంలో చెప్పడం కూడా ‘దేవర’ కి కొంత ప్లస్ అయ్యిందనే మాట వినిపిస్తుంది. అవుట్ ఆఫ్ ది బౌండరీలో ఉన్న ‘దేవర’ వరల్డ్ లోకి ఆడియన్స్ పూర్తిగా వెళ్ళిపోయి సినిమాని ఆస్వాదించారు. అందుకే లాజిక్స్ అన్ని పక్కన పడేసి సినిమాలో ఉన్న ఎలివేషన్, యాక్షన్ ఎపిసోడ్స్ ని ఎంజాయ్ చేశారు.

పబ్లిక్ రెస్పాన్స్ మూవీ కలెక్షన్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే స్పీడ్ లో కలెక్షన్స్ వస్తే దసరా ఫెస్టివల్ కి మరల ‘దేవర’ పుంజుకోవచ్చని అనుకుంటున్నారు. అదే జరిగితే లాంగ్ రన్ లో 500-600 కోట్ల మధ్యలో ఈ మూవీకి కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ పండితులు అంచన వేస్తున్నారు. ‘దేవర’ మూవీ మొదటి రోజు ఓపెనింగ్స్ తోనే ఎన్టీఆర్ కి పాన్ ఇండియా లెవల్ స్టాంగ్ మార్కెట్ ఉందని స్పష్టమైపోయింది.

కచ్చితంగా ఇది తారక్ నుంచి రాబోయే ‘వార్ 2’, ‘డ్రాగన్’ సినిమాలకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ‘వార్ 2’ మూవీ సక్సెస్ అయితే హిందీ మార్కెట్ లో ఎన్టీఆర్ కి మరింత ఇమేజ్ పెరగడం ఖాయం అని ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తోంది. అలాగే నీల్ డ్రాగన్ మూవీతో 1000 కోట్ల క్లబ్ లో ఎన్టీఆర్ సోలోగా చేరుతాడని భావిస్తున్నారు.