దావూది సాంగ్ తొలగించడానికి రీజన్ చెప్పిన ఎన్టీఆర్
‘దేవర’ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ లో అందరికి బాగా నచ్చిన పాట దావూది.
By: Tupaki Desk | 6 Oct 2024 4:04 AM GMT‘దేవర’ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ లో అందరికి బాగా నచ్చిన పాట దావూది. దీనికి కారణం ఇందులో ఎన్టీఆర్ అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో అలరించడమే. అలాగే జాన్వీ కపూర్ కూడా ఎన్టీఆర్ తో పోటీ పడి డాన్స్ చేసింది. ఈ సాంగ్ రిలీజ్ తర్వాత విపరీతంగా వైరల్ అయ్యింది. థియేటర్స్ లో ఈ సాంగ్ చూసిన తర్వాత ఫ్యాన్స్ కి పూనకాలు రావడం గ్యారెంటీ అని అందరూ భావించారు. అయితే రిలీజ్ తర్వాత మూవీలో దావూది సాంగ్ లేదు. ఇది ఎన్టీఆర్ అభిమానులని తీవ్రంగా నిరాశ పరిచింది. చాలా మంది ఈ సాంగ్ గురించి పబ్లిక్ టాక్ లో ప్రస్తావించారు.
అలాగే సాంగ్ కి మళ్ళీ పెట్టాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొరటాల శివకి రిక్వెస్ట్ లు పెట్టారు. సినిమా నిడివి ఎక్కువ అయ్యిందని ఈ సాంగ్ తొలగించారనే ప్రచారం నడిచింది. ఫైనల్ గా అయితే రెండో వారం థియేటర్స్ ప్రింట్ లో ఈ సాంగ్ కి జతచేశారు. ఇప్పటికే ఈ సాంగ్ కి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. నిజానికి దావూది సాంగ్ ని ఎందుకు తొలగించాల్సి వచ్చిందనేది సుమ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఆ సాంగ్ తీసేయాలని నిర్ణయం అందరం కలెక్టివ్ గా తీసుకున్నదని ఎన్టీఆర్ స్పష్టం చేశారు.
మూవీ కథ చాలా సీరియస్ మూడ్ లో నడుస్తున్న సమయంలో సడెన్ గా ఈ సాంగ్ వచ్చినట్లు అనిపించింది. ఆ ఆడియన్స్ ఆలోచనలని పూర్తిగా డైవర్ట్ చేస్తుంది. సాంగ్ అయిపోయిన తర్వాత కూడా కథ సీరియస్ నోట్ లోనే ఉంటుంది. ఆడియన్స్ ని డైవర్ట్ చేయడం ఇష్టం లేక సాంగ్ ని తొలగించడం జరిగిందని ఎన్టీఆర్ చెప్పారు. సినిమా చూసిన తర్వాత ఆ సాంగ్ లేదనే ఫీలింగ్ ఎవ్వరికి రాలేదని, కథలో ఆడియన్స్ లీనమైపోయారని సుమ వారికి తెలియజేసింది. అదే ఫీడ్ బ్యాక్ వస్తే మాత్రం మా నిర్ణయం కరెక్ట్ అయినట్లే అని ఎన్టీఆర్ అన్నారు.
ఒక వేళ సాంగ్ ని మళ్ళీ యాడ్ చేయాలన్నా అదంతా పెద్ద ప్రోసెస్. అన్ని భాషలలో సెన్సార్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే యాడ్ చేయడానికి కుదురుతుందని తారక్ క్లారిటీ ఇచ్చారు. అలాగే మూవీలో ఆయుధ పూజ సాంగ్ తన కెరియర్ లో బెస్ట్ అని ఎన్టీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సాంగ్ కోసం చాలా టెన్షన్ తీసుకున్నాం. అనిరుద్ వేరే షెడ్యూల్స్ తో బిజీగా ఉన్నారు. షూటింగ్ కి టైం దగ్గర పడుతుంది. అయితే రామజోగయ్య శాస్త్రీ కేవలం ఒక గంటలో సాంగ్ ని రాసేసి ఇచ్చారు.
మాకంటే ఆయన ఎక్కువ ‘దేవర’ స్టొరీతో కనెక్ట్ అయిపోయారు. ఆ వరల్డ్ లో ఆయన కంప్లీట్ గా ఉండిపోవడం వలన అంత వేగంగా రాయగాలిగారని అనిపించింది. అలాగే ఆ సాంగ్ కోసం గణేష్ మాస్టర్ చాలా అద్భుతమైన డాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేశారు. సాంగ్ గురించి చెప్పినపుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎంతోకాలంగా నాతో సాంగ్ చేయాలని అతను వెయిట్ చేస్తున్నానని చెప్పారు. అన్ని రకాల డాన్స్ స్టెప్పులు గతంలో చేసేసాను. అయితే ఇందులో చేసినవి చాలా ప్రత్యేకం. డాన్స్ అంతా తాండవం ఆడుతున్నట్లు ఉంటుంది. ఆయుధ పూజ సాంగ్ లో తాతగారి స్టెప్ కావాలని పెట్టింది కాదు. గణేష్ మాస్టర్ తన స్టైల్ లో ఏదో కంపోజ్ చేశారు. నేను తరువాత చూసుకుంటే తాతగారి స్టెప్ ఉందనే విషయం నాకు అర్ధమైందని ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో సాంగ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.