Begin typing your search above and press return to search.

దేవర : సందీప్‌, కపిల్‌ లతో అక్కడ కుమ్మేశారు!

ఎన్టీఆర్‌ హీరోగా జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది.

By:  Tupaki Desk   |   17 Sep 2024 6:04 AM GMT
దేవర : సందీప్‌, కపిల్‌ లతో అక్కడ కుమ్మేశారు!
X

ఎన్టీఆర్‌ హీరోగా జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో, సౌత్‌ రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్‌ ఇండియా మొత్తం దేవర సినిమా ఊపేసే విధంగా విడుదల చేయబోతున్నారు. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలని చాలానే వస్తున్నాయి. కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో సందడి చేయాలంటే కచ్చితంగా భారీ ఎత్తున ప్రమోషన్ తప్పనిసరి. దేవర సినిమాకు అదే చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్ తో కుమ్మేస్తున్నారు.

బెంగళూరు లో ఎన్టీఆర్‌ కి ఉన్న ఫాలోయింగ్‌ నేపథ్యంలో దేవరకి ఇప్పటికే మంచి బజ్‌ క్రియేట్‌ అయింది. తమిళనాడు లో ప్రచారం కోసం నేడు చెన్నై కి ఎన్టీఆర్‌ వెళ్లబోతున్నాడు. కేరళలోనూ కచ్చితంగా దేవర కి మంచి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల తర్వాత అత్యంత ముఖ్యమైన ఏరియా నార్త్‌ ఇండియా. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు నార్త్‌ ఇండియాలో పెద్ద ఎత్తున వసూళ్లు నమోదు చేస్తున్నాయి. కనుక ఈ సినిమా తప్పకుండా బాలీవుడ్‌ ప్రేక్షకులను మెప్పిస్తుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. సినిమా నార్త్‌ ప్రమోషన్‌ కోసం ఎన్టీఆర్ రెండు రోజుల సమయం కేటాయించడం జరిగింది.

ముంబై లో సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రత్యేక ఈవెంట్‌ ను నిర్వహించి ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. అదే సమయంలో యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో హిందీలో దేవర యూనిట్‌ సభ్యులు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నార్త్‌ లో సందీప్ వంగ ఇంటర్వ్యూ తో దేవర కి మంచి రీచ్ దక్కింది. యానిమల్ దర్శకుడి దేవర ఇంటర్వ్యూ అంటూ అక్కడి మీడియా లో ప్రముఖంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు కపిల్ శర్మ షో తో దేవర సినిమా గురించి నార్త్‌ ఇండియన్ ప్రేక్షకులకు చెప్పేందుకు ఎన్టీఆర్‌ రెడీ అయ్యాడు.

ఇప్పటికే కపిల్‌ శర్మ షో లో జాన్వీ కపూర్‌, సైఫ్ అలీ ఖాన్‌, కొరటాల శివ తో కలిసి ఎన్టీఆర్‌ పాల్గొన్నాడు. ఆ ఎపిసోడ్‌ ను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఇప్పటికే కపిల్‌ శర్మ షో లో దేవర టీం పాల్గొన్నట్లుగా బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దాంతో సోషల్‌ మీడియాలో నార్త్‌ ఇండియన్స్ దేవర సినిమా గురించి చర్చించుకుంటున్నారు. కపిల్‌ శర్మ షో లో ఎన్టీఆర్‌ చేసిన సందడి అంతా ఇంతా కాదట.

ముఖ్యంగా కపిల్‌ తో ఎన్టీఆర్‌ ఫన్నీ చిట్ చాట్‌, మధ్య లో వచ్చే కామెడీ స్కిట్స్‌, పాటలు, జాన్వీ కపూర్‌ ప్రజెన్స్ ఇలా ప్రతి ఒక్కటి దేవర సినిమా ను కపిల్‌ శర్మ షో లో విపరీతంగా ప్రమోట్‌ చేసే విధంగా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి సందీప్ వంగ ఇంటర్వ్యూ, కపిల్‌ శర్మ టాక్ షో తో దేవర సినిమాకు నార్త్‌ లో ప్రమోషన్స్‌ కుమ్మేశారు. అక్కడ మినిమం గా రూ.250 కోట్ల వసూళ్లను ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఆ స్థాయి కలెక్షన్స్ సాధ్యమేనా చూడాలి.