దేవర OTT: ట్విస్ట్ ఏమిటంటే..
అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తూ అభిమానులను కాలర్ ఎత్తుకునేలా చేస్తున్నాడు.
By: Tupaki Desk | 24 Oct 2024 7:04 AM GMTతనదైన నటనతో సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ప్రియులను మెప్పిస్తూ బడా హీరోగా దూసుకుపోతోన్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. టాలీవుడ్ హిస్టరీలోనే ఎవరికీ దక్కని విధంగా వరుసగా హిట్లు మీద హిట్లను అందుకున్న అతడు.. పాన్ ఇండియా స్టార్‌గానూ ఎదిగిపోయాడు. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తూ అభిమానులను కాలర్ ఎత్తుకునేలా చేస్తున్నాడు.
సూపర్ డూపర్ ఫామ్‌తో దూసుకుపోతోన్న జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే ‘దేవర’ అనే సినిమాను చేశాడు. బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ ఏరియాల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఈ చిత్రం వచ్చింది. హై రేంజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీకి రెస్పాన్స్ లభించింది. అందుకు తగ్గట్లే దీనికి భారీ వసూళ్లు లభించాయి.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ దాదాపు నెల రోజులుగా థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికీ ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌తో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ డేట్ గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ మాత్రం దీనిపై ఎలాంటి క్లారిటీని ఇవ్వడం లేదు. దీంతో ఇవి మరింత ఎక్కువ అవుతున్నాయి.
వాస్తవానికి ‘దేవర’ సినిమాను థియేటర్లలోకి వచ్చిన 50 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని టాక్ వచ్చింది. కానీ, ఈ చిత్రాన్ని నవంబర్ 8వ తేదీ నుంచే స్ట్రీమింగ్ చేస్తారని కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, తాజాగా ‘దేవర’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి ఓ ఊహించని న్యూస్ చక్కర్లు కొడుతోంది.
బయట ప్రచారం జరుగుతున్నట్లుగానే ‘దేవర’ సినిమాను నెట్‌ఫ్లిక్స్ సంస్థ నవంబర్ 8వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకు రాబోతుందట. కానీ, హిందీలో మాత్రం దీన్ని నవంబర్ 22 నుంచి తీసుకు వస్తుందని తెలిసింది. అక్కడ నిర్మాతలు పెట్టిన నిబంధన మేరకే 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్ అవనుందని సమాచారం. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో మాత్రం 8 నుంచి స్టార్ట్ కానుందని టాక్.
వైల్డ్ యాక్షన్‌తో రూపొందిన ‘దేవర’ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను చేశారు. ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి అనిరుథ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అలాగే, శ్రీకాంత్, చాకో, అజయ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.