Begin typing your search above and press return to search.

దేవర రేర్ ఫీట్… ఆ టెక్నాలజీలో ఫస్ట్ ఇండియన్ మూవీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి వస్తోంది.

By:  Tupaki Desk   |   18 Sep 2024 3:36 AM GMT
దేవర రేర్ ఫీట్… ఆ టెక్నాలజీలో ఫస్ట్ ఇండియన్ మూవీ
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి వస్తోంది. యూఎస్ లో సెప్టెంబర్ 26న ‘దేవర’ మూవీ స్పెషల్ ప్రీమియర్స్ ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రీమియర్ షోలకి భారీగా టికెట్స్ బుక్ అయ్యాయి. యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘దేవర’ మూవీ జోరు చూపిస్తోంది. ఇండియాలో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. ప్రేక్షకుల ‘దేవర’ మూవీ బుకింగ్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే ‘దేవర’ మూవీ యూఎస్ తో పాటు యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా దేశాలలో కూడా రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఆయా దేశాలలో సెటిల్ అయిన ఎన్నారైలు ఇండియన్ సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే నార్త్ అమెరికాలో రిలీజ్ అయినన్ని థియేటర్స్ లో మిగిలిన దేశాలలో ఇండియన్ సినిమాలు విడుదల కాకపోవచ్చు. యూఎస్ తర్వాత అత్యధికంగా ఆస్ట్రేలియాలో మన ఇండియన్ సినిమాలు రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ‘దేవర’ సినిమా ఆస్ట్రేలియాలో కొత్తరకమైన థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోందని తెలుస్తోంది.

ఆస్ట్రేలియాలో డి-బాక్స్ టెక్నాలజీ ఉన్న కొన్ని సెలక్టివ్ థియేటర్స్ లో ‘దేవర’ మూవీని రిలీజ్ చేస్తున్నారని సమాచారం. దీనికోసం డి-బాక్స్ టెక్నాలజీకి సరిపోయే విధంగా ‘దేవర’ మూవీ అవుట్ ఫుట్ మాస్టరింగ్ చేసారంట. అయితే పర్టిక్యులర్ గా కొన్ని సెలక్టడ్ థియేటర్స్ లలో మాత్రమే డి-బాక్స్ టెక్నాలజీలో ‘దేవర’ని చూసే అవకాశం ఉందంట. ఈ టెక్నాలజీ ఉన్న థియేటర్స్ లో సినిమాని చూస్తే ప్రేక్షకులు నేరుగా సినిమా వరల్డ్ లోకి వెళ్ళిపోతారు.

వారి కళ్ళముందే జరుగుతున్నట్లు సినిమాలో దృశ్యాలు కనిపిస్తాయి. డి-బాక్స్ టెక్నాలజీ 3డీకి అడ్వాన్స్ వెర్షన్ లో ఉంటుంది. ఇప్పటికే హాలీవుడ్ సినిమాలు ఈ టెక్నాలజీ ఉన్న థియేటర్స్ లో ప్రేక్షకులకి సరికొత్త అనుభూతి అందిస్తున్నాయి. ‘దేవర’ మాత్రం డి-బాక్స్ టెక్నాలజీలో ప్రదర్శితమవుతున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా రేర్ ఫీట్ ని సొంతం చేసుకుంది. మరి ఈ డి-బాక్స్ టెక్నాలజీ థియేటర్స్ లో ‘దేవర’ మూవీ ఎలాంటి అనుభూతి ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే ‘దేవర’ మూవీ ప్రమోషన్స్ ప్రస్తుతం యాక్టివ్ గా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ తో పాటు ‘దేవర’ టీమ్ మొత్తం చెన్నైలో ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ లో ఉంది. తమిళంలో ఈ సినిమాకి క్రేజ్ తీసుకొచ్చే పనిలో పడ్డారు. కోలీవుడ్ లో వరుస ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు. చెన్నై తర్వాత బెంగుళూరు వెళ్లి ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.