Begin typing your search above and press return to search.

దేవర నయా రికార్డ్.. అప్పుడే 80 శాతానికి పైగా!

రిలీజ్ కు ముందే వరల్డ్ వైడ్ గా దేవర అనేక రికార్డులు క్రియేట్ చేయడంతో.. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని బల్లగుద్ది చెప్పారు!

By:  Tupaki Desk   |   30 Sep 2024 4:06 PM GMT
దేవర నయా రికార్డ్.. అప్పుడే 80 శాతానికి పైగా!
X

దేవర.. దేవర.. దేవర.. గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ఇదే టాపిక్! టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆరేళ్ల తర్వాత సోలోగా ప్రేక్షకుల ముందుకు రావడంతో అంతా దేవర కోసమే మాట్లాడుకున్నారు. కొరటాల శివ తెరకెక్కించిన ఆ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రమోషనల్ కంటెంట్ తో మేకర్స్.. వాటిని ఆకాశాన్ని తాకేలా చేశారు. రిలీజ్ కు ముందే వరల్డ్ వైడ్ గా దేవర అనేక రికార్డులు క్రియేట్ చేయడంతో.. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని బల్లగుద్ది చెప్పారు!

అభిమానులతోపాటు సినీ ప్రియులు అంచనాలకు తగ్గట్లే దేవర దూసుకుపోతోంది. పాజిటివ్ టాక్ తో అలరిస్తూ.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయిన దేవర.. రూ.172 కోట్ల ఓపెనింగ్స్ సాధించి వారెవ్వా అనిపించింది. అదే దూకుడుతో మూడు రోజుల్లోనే రూ.304 కోట్లు రాబట్టి షాక్ ఇచ్చింది. ఫస్ట్ వీకెండ్ కు భారీ వసూళ్లు సాధించిన టాలీవుడ్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది మన తారక్ దేవర చిత్రం.

అదే సమయంలో దేవర మరో రికార్డు క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ గా మూడు రోజుల వసూళ్లతో 80 శాతం బడ్జెట్ ను రికవరీ చేసేసింది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అదీ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ సత్తా అని ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో దేవర.. భారీ వసూళ్లను రాబడుతోంది. అనేక చోట్ల ఇంకా హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రూ.87 కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించింది. నార్త్ లో కూడా మంచి కలెక్షన్లు వస్తున్నాయి.

దసరా సెలవులు కూడా వస్తుండటంతో దేవర మరిన్ని వసూళ్లు రాబట్టి త్వరలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకోనుంది. ఆ తర్వాత లాభాల బాటలోకి వెళ్లనుంది. కోస్టల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన మూవీలో కొన్ని పాయింట్స్ ఆసక్తికరంగా అనిపిస్తున్నాయని సినీ ప్రియులు ఇప్పటికీ రివ్యూస్ ఇస్తున్నారు. తారక్ డ్యూయల్ రోల్ లో వేరియేషన్ చూపిస్తూ అదరగొట్టేశారని కొనియాడుతున్నారు. థియేటర్లలో మాస జాతర అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇక దేవర మూవీలో జాన్వీ క‌పూర్‌ హీరోయిన్ గా నటించగా.. సైఫ్ అలీఖాన్‌ విలన్ గా కనిపించారు. ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, అజ‌య్‌, గెట‌ప్ శీను సహా పలువురు ముఖ్య పాత్ర‌లు పోషించారు. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌. నిర్మించారు. మరి మీరు దేవర సినిమాను చూశారా? లేదా?