దేవర: RRRను కొట్టినా హనుమాన్ ను దాటలేదు
అయితే ఒక రికార్డు విషయంలో దేవర RRR ను దాటేసినా హనుమాన్ రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. 1
By: Tupaki Desk | 18 Oct 2024 7:10 AM GMTదేవర.. దేవర.. దేవర.. దేవర.. ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయిన సినిమా పేర్లలో ఇది ఒకటి. టాలీవుడ్ బడా హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ అంతలా ఆరంభంలోనే పాన్ ఇండియా రేంజ్‌లో హైప్‌ను క్రియేట్ చేసుకుంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం ఎంతో గ్రాండ్‌గా ఆడియెన్స్ ముందుకు వచ్చింది.
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ చిత్రానికి అనుకున్న విధంగా పాజిటివ్ టాక్ అయితే రాలేదు. కానీ, రెస్పాన్స్ మాత్రం ఫస్ట్ డే భారీ స్థాయిలో లభించింది. దీంతో రికార్డు ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ సినిమా మంచి ప్రదర్శన చేస్తూ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు వచ్చి క్లీన్ హిట్ స్టేటస్ కూడా సొంతం అయింది.
కోస్టల్ ఏరియా బ్యాగ్‌డ్రాప్‌తో హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందిన ‘దేవర’ సినిమా ఇప్పటికే మూడు వారాలను కంప్లీట్ చేసుకుంది. దసరా పండుగ సెలవులను బాగా అనుకూలంగా మార్చుకున్న దీనికి వరల్డ్ వైడ్‌గా రూ. 250 కోట్లు షేర్‌తో పాటు రూ. 520 కోట్ల వరకూ గ్రాస్ వసూలు అయింది. ఇలా ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ఎన్నో రికార్డులను కూడా నమోదు చేసుకుంది.
అయితే ఒక రికార్డు విషయంలో దేవర RRR ను దాటేసినా హనుమాన్ రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. 19 రోజుల వరకు కూడా ఈ చిత్రం కంటిన్యూగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఏరియాల కలెక్షన్లతో కలుపుకుని కోటి రూపాయల కంటే ఎక్కువగానే షేర్‌ను వసూలు చేసింది. లెక్క ఏ రోజు కూడా కోటి కంటే తక్కువ రాలేదు. దీంతో RRR 17 రోజుల రికార్డును దాటేసింది. RRR కేవలం 17 రోజుల వరకు కోటి షేర్ అందుకుంది. తరువాత 18వ రోజు నుంచి లెక్క తగ్గుతూ వచ్చింది.
దేవర మాత్రం 19వ రోజు కూడా అస్సలు తగ్గలేదు. తద్వారా ఈ ఘనతను సాధించిన అతి తక్కువ సినిమాల సరసన ఈ చిత్రం చేరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కోటి రూపాయలు అంతకంటే ఎక్కువ షేర్‌ను వరుసగా ఎక్కువ రోజులు సాధించిన చిత్రాల్లో 28 రోజులతో ‘బాహుబలి 2’ సినిమా టాప్‌లో ఉంది. ఆ తర్వాత ‘బాహుబలి 1’ (20 రోజులు), ‘హనుమాన్’ (20 రోజులు) సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు వీటి తర్వాత ప్లేస్‌కు ‘దేవర’ వచ్చి చేరింది. తద్వారా తృటిలో ‘హనుమాన్’ మూవీ రికార్డును మిస్ మిస్సయ్యింది.
సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రూపొందిన ‘దేవర’ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, చాకో, అజయ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుథ్ మ్యూజిక్ ఇచ్చాడు.