Begin typing your search above and press return to search.

దేవర.. పాదగట్టం సెగలు..

కొంతమంది దేవర ట్రైలర్ లోని కొరటాల శివ చాలా డీటెయిలింగ్ గా కంటెంట్ ని చెప్పాడని ప్రశంసిస్తూ ఉంటే మరికొంత మంది పాదఘట్టం, సముద్రమట్టం అంటూ ట్రోలింగ్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   11 Sep 2024 3:44 AM GMT
దేవర.. పాదగట్టం సెగలు..
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ దేవర ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ కి ఓ వర్గం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. అదే సమయంలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సీన్స్ ప్రెజెంటేషన్స్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఎన్టీఆర్ దేవర సినిమాలో తండ్రి కొడుకులుగా రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నాడు. ఫ్యాన్స్ కి అయితే దేవర ట్రైలర్ బాగా కనెక్ట్ అయ్యింది.

సినిమా మీద వారికి ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగాయి. ఇదిలా ఉంటే దేవర కంటే ముందుగా కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తో ఆచార్య మూవీ చేసి డిజాస్టర్ అందుకున్నారు. ఈ సినిమా కథాంశం ప్రేక్షకులకి అస్సలు కనెక్ట్ కాలేదు. మెగా అభిమానులు సైతం ఆచార్య సినిమా విషయంలో డిజప్పాయింట్ అయ్యారు. ముఖ్యంగా పాదఘట్టం అనే ప్లేస్ చుట్టూ ఆచార్య మూవీ కథ తిరుగుతూ ఉంటుంది.

సినిమాలో ఆ పాదఘట్టం సౌండ్ మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దేవర ట్రైలర్ లోని కొన్ని ఎలిమెంట్స్ ని ఆచార్య పాదఘట్టంతో పోల్చి చూపిస్తూ సోషల్ మీడియాలో ఒక వర్గం వారు ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది దేవర ట్రైలర్ లోని కొరటాల శివ చాలా డీటెయిలింగ్ గా కంటెంట్ ని చెప్పాడని ప్రశంసిస్తూ ఉంటే మరికొంత మంది పాదఘట్టం, సముద్రమట్టం అంటూ ట్రోలింగ్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

ఆచార్యలో పాదఘట్టం ఉన్నట్లు దేవరలో కూడా ఒక ప్రాంతం ఉందని, అలాగే రామ్ చరణ్ పాత్రను దేవర పాత్రతో పోలుస్తూ సోనూసూద్ క్యారెక్టర్ సైఫ్ పాత్రకు దగ్గరగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క ట్రైలర్ చూసి ఆ విధంగా ఆచార్య పోలికలు ఉన్నట్లు కామెంట్ చేయడం కరెక్ట్ కాదని మరికొందరు వాదిస్తున్నారు. అయితే కొంతమంది కావాలనే ఇలా సినిమాపై నెగిటివిటీ పెంచడానికి పనిగట్టుకొని విషప్రచారం చేస్తున్నారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు.

దేవర ట్రైలర్ తో మూవీకి కొంత హైప్ అయితే క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ట్రైలర్ వ్యూవ్స్ పరంగా జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు దేవర మూవీ ట్రైలర్ అన్ని భాషలలో కలిపి 17 మిలియన్ వ్యూవ్స్ క్రాస్ చేసింది. ఇదే స్పీడ్ లో కొనసాగితే 24 గంటల్లో 20 మిలియన్ వ్యూవ్స్ ని ఈజీగా క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

ఎన్టీఆర్ 6 ఏళ్ళ తర్వాత సోలోగా ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా కావడంతో దేవర కోసం ఫ్యాన్స్ ఆకలితో ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్స్ చూస్తుంటే కచ్చితంగా దేవరతో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికుల ఆకలి కూడా తీరిపోతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోయే ఈ మూవీ అంచనాల్ని ఏ మేరకు అందుకుంటుంది అనేది వేచి చూడాలి.