Begin typing your search above and press return to search.

దేవర.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే..

ముందుగా చేసుకున్న డీల్ ప్రకారం సినిమాను నవంబర్ 8వ తేదీన ఓటీటీ లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   14 Oct 2024 9:30 PM GMT
దేవర.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే..
X

దేవర సినిమా ద్వారా మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఒక బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నాడు. మొదటిసారి 500 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా ఎన్టీఆర్ కు మర్చిపోలేని గుర్తింపుని ఇచ్చింది. ఇక సినిమా రిలీజ్ అయినప్పుడు భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద బలంగా నిలబడింది పొంది అంటే ఫ్యాన్స్ కూడా ఒక కారణమని చెప్పాలి. ఎన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చినా కూడా వాటిని పట్టించుకోకుండా థియేటర్లలో సినిమా చూడండి అని గట్టిగా ప్రమోషన్స్ కూడా చేశారు.

దీంతో సినిమాకు దసరా సెలవుల వరకు మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఒకరోజు తగ్గినా మరుసటి రోజు మళ్ళీ కలెక్షన్స్ పెంచుకునే విధంగా దేవర సినిమా కొనసాగింది. దాదాపు అన్ని ఏరియాలలో కూడా ఈ సినిమా అనుకున్న టార్గెట్ ను అయితే పూర్తిచేసుకుంది. ఇక కొన్ని రికార్డులను కూడా తిరగ రాయడం విశేషం. ముఖ్యంగా బాహుబలి మొదటి భాగం రికార్డును కూడా దేవర తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ చేసింది.

ఇక ఈవారం కూడా మంచి కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పోటీగా ఎలాంటి సినిమాలు లేవు. కాబట్టి దేవర మరి కొన్ని రోజులు డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను అందించే అవకాశం అయితే ఉంది. అయితే ఈ సినిమా OTT లోకి ఎప్పుడు వస్తుంది అనే విషయం కూడా గత కొన్ని రోజులుగా వైరల్ అవుతుంది. సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక వచ్చేవారమే స్ట్రీమింగ్ అవుతుందని కొన్ని రకాల రూమర్స్ అయితే వచ్చాయి. కానీ అందులో నిజం అయితే లేదు. ప్రస్తుతం కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయి కాబట్టి ఓటీటీ డీల్ విషయంలో మళ్లీ ఎలాంటి మార్పులు జరగలేదు. ముందుగా చేసుకున్న డీల్ ప్రకారం సినిమాను నవంబర్ 8వ తేదీన ఓటీటీ లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడ కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది.

ఇక దేవర సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుంది అనే విషయం కూడా అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. దర్శకుడు కొరటాలు అయితే ఇప్పటికే సెకండ్ పార్ట్ కు సంబంధించిన కొంత షూట్ సిద్ధంగా ఉందని తెలియజేశాడు. మరిన్ని పవర్ ఫుల్ సీన్స్ సెకండ్ పార్ట్ లో ఉంటాయని కూడా చెప్పాడు. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వార్ 2తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత దేవర 2 గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ వీలైనంత త్వరగా సెకండ్ పార్ట్ ను స్టార్ట్ చేయాలని ఎన్టీఆర్ కూడా అనుకుంటున్నాడు.