దేవర మాట కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్..!
ఐతే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరగబోతుంది. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఏం మాట్లాడతాడు అన్నది ఆసక్తికరంగా మారింది.
By: Tupaki Desk | 22 Sep 2024 6:23 AM GMTస్టార్ హీరోల్లో కొంతమంది కెమెరా ఆన్ చేస్తే చాలు అదరగొట్టేస్తుంటారు. అప్పటిదాకా మామూలుగా అనిపించిన వారు కాస్త షాట్ రెడీ అనగానే విజృంభించేస్తారు. ఐతే కొంతమంది ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా తమ మాటలతో మెస్మరైజ్ చేస్తారు. అలాంటి వారిలో ఎన్టీఆర్ ఒకరు. తారక్ మైక్ అందుకుని మాట్లాడితే చాలు చాలా ఎనర్జిటిక్ స్పీచ్ అందిస్తాడు. స్పీచ్ లు ఇవ్వడంలో ఎన్టీఆర్ తన మార్క్ సెట్ చేసుకున్నాడు. ఐతే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరగబోతుంది. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఏం మాట్లాడతాడు అన్నది ఆసక్తికరంగా మారింది.
ఎన్టీఆర్ కేవలం సినీ హీరో అయితే కేవలం సినిమాల గురించి మాత్రమే మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. కానీ అలా కాదు తారక్ చుట్టూ ఒక రాజకీయ గోడ కూడా ఉంది. మరి ప్రస్తుత రాజకీయాల మీద జరుగుతున్న పరిణామాల మీద ఎన్టీఆర్ ఏమన్నా నోరు విప్పుతాడా అన్నది కూడా ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ఐతే సినిమా వేడుక కాబట్టి కేవలం సినిమా గురించి మాత్రమే స్పీచ్ ఇచ్చి వెళ్తాడా అన్నది కూడా చర్చిస్తున్నారు. రెండేళ్ల తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందుకు వస్తున్న ఈ ఈవెంట్ వారికెంతో స్పెషల్ కానుంది.
ఏది ఏమైనా ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎలా మాట్లాడుతాడు అన్నది సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ లో దేవర సినిమా మీద తన నమ్మకాన్ని వెల్లబుచ్చిన తారక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫ్యాన్స్ ని ఉత్సాహపరచేలా ఇంకా ఎక్స్ క్లూజివ్ డీటైల్స్ చెబుతాడని అంటున్నారు. అంతేకాదు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనిరుద్ లైవ్ పెర్ఫార్మెన్స్ కూడా ఉందని టాక్. హైదరాబా నోవాటెల్ హోటల్ లో ఈరోజు సాయంత్రం దేవర ఈవెంట్ జరుగుతుంది.
ఈ ఈవెంట్ కు గెస్టులుగా త్రివిక్రం, రాజమౌళి వస్తున్నారని టాక్. ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేశారు. సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న దేవర సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదరగొట్టేసింది. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి. దేవర వైబ్ చూస్తుంటే ఎన్టీఆర్ ఖాతాలో మరో సూపర్ హిట్ వచ్చేలా ఉంది.