Begin typing your search above and press return to search.

దేవర ఈవెంట్ క్యాన్సిల్.. ఈ పొలిటికల్ ఫైట్ ఏంటీ?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ దేవర పార్ట్-1 ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరగాల్సి ఉన్నా.. క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   25 Sep 2024 4:07 PM GMT
దేవర ఈవెంట్ క్యాన్సిల్.. ఈ పొలిటికల్ ఫైట్ ఏంటీ?
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ దేవర పార్ట్-1 ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరగాల్సి ఉన్నా.. క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని నోవాటెల్ లో ఈవెంట్ ఏర్పాటు చేయగా.. పరిమితికి మించి అభిమానులు రావడంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. గేట్లు బద్దలు కొట్టి మరీ వేల సంఖ్యలో అభిమానులు లోపలికి దూసుకెళ్లారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ట్రై చేసినా కుదరకపోవడంతో ప్రీ రిలీజ్ వేడుక రద్దు చేశారు.

దీంతో తారక్ ఫ్యాన్స్ అంతా నిరాశతో వెనుదిరిగారు. శ్రేయస్ మీడియాపై ఫుల్ గా కామెంట్స్ చేశారు. కానీ తమ తప్పేం లేదని, అభిమానులు ఎక్కువగా రావడం వల్ల ఈవెంట్ రద్దు అయిందని శ్రేయస్ మీడియా సీఈవో క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత స్టేట్ ఇంటెలిజెన్స్.. 35వేల మంది ఫ్యాన్స్ నోవాటెల్ కు వచ్చారని అంచనా వేసింది. అదే సమయంలో హోటల్ కు రూ.33 లక్షల నష్టం వచ్చిన వార్తలు వస్తున్నాయి. మొత్తం చెల్లించాలని నిర్వాహకులు.. డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇదంతా పక్కన పెడితే.. ఈవెంట్ రోజు నోవాటెల్ దగ్గర్లోని మరో హోటల్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ జరిగిందని తెలుస్తోంది. దీంతో పోలీసులంతా అక్కడ కార్యక్రమం పూర్తయ్యాక ఇక్కడికి వచ్చారని కొందరు చెబుతున్నారు. ఇంతలో ఇక్కడ జరగాల్సిందని జరిగిందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. రూమర్స్ వచ్చాయి. కాగా, రీసెంట్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సెటైర్లు వేసిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో శాంతి భద్రతలు సీఎం రేవంత్ రెడ్డి కాపాడలేకపోతున్నారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పండుగ, ఈవెంట్, బహిరంగ సభ సహా అన్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగాయని, కానీ రేవంత్ ప్రభుత్వం సాధారణ కార్యక్రమాలు కూడా నిర్వహించలేకపోతోందని విమర్శించారు. ప్రభుత్వ అసమర్థత కారణంగా ఎన్టీఆర్ దేవర ఈవెంట్ రద్దు చేయాల్సి వచ్చిందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో నగరం ఉందని అన్నారు.

అయితే కేటీఆర్ వ్యాఖ్యల తర్వాత దేవర ఈవెంట్ క్యాన్సిల్ విషయం రాజకీయ బిందువుగా మారింది. సోషల్ మీడియాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యూజర్లు పరస్పరం కామెంట్స్ చేసుకుంటున్నారు. గత తొమ్మిది నెలల కాంగ్రెస్ హయాంలో ఒక్క దుర్ఘటన కూడా జరగలేదని హస్తం పార్టీ ట్విట్టర్ యూజర్లు చెబుతున్నారు. మెగా ఈవెంట్ గణేష్ నిమజ్జనం కూడా సజావుగా జరిగిందని అంటున్నారు. సినిమా ఈవెంట్ కు సీఎంకు సంబంధం లేదని చెబుతున్నారు. పోలీసు, హోంశాఖల సూచనలు నిర్వాహకులు ఫాలో అవ్వాలని అంటున్నారు. ఏదేమైనా ఈవెంట్ క్యాన్సిల్ అయ్యాక.. ఇలాంటి మాటల యుద్ధం అవసరం లేదని, సబబు కాదని కొందరు నెటిజన్లు సూచిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి.. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తారేమో చూడాలి.