అక్కడ కల్కిని ఫాలో అవుతోన్న దేవర
ఇప్పుడు నార్త్ అమెరికాలో ఇండియన్ సినిమాలకి మంచి ఆదరణ లభిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 31 Aug 2024 7:30 PM GMTఇప్పుడు నార్త్ అమెరికాలో ఇండియన్ సినిమాలకి మంచి ఆదరణ లభిస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి వచ్చే పాన్ ఇండియా కథలకి నార్త్ అమెరికాలో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. స్పెషల్ ప్రీమియర్స్ నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకొని మూవీస్ ని చూడటానికి రెడీ అయిపోతున్నారు. కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. మొదటి రోజే రికార్డ్ స్థాయిలోనే ఓపెనింగ్ కలెక్షన్స్ ని నార్త్ అమెరికా మార్కెట్ లో తెలుగు సినిమాలు సాధిస్తున్నాయి.
ఈ ఏడాది నార్త్ అమెరికాలో కల్కి 2898ఏడీ మూవీ ఏకంగా 18.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని అందుకుంది. బాహుబలి 2 తర్వాత నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా కల్కి2898ఏడీ నిలిచింది. ఈ సినిమాకి మొదటి రోజే అక్కడ భారీ కలెక్షన్స్ వచ్చాయి. స్పెషల్ ధరలు కూడా నిర్ణయించారు. ఇది కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా రావడానికి కారణం అయ్యాయి.
ఇప్పుడు అదే స్ట్రాటజీని యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాకి కూడా అమలు చేయబోతున్నారంట. కల్కి సినిమాకి XD వెర్షన్ కి యూఎస్ లో 30 డాలర్లు టికెట్ ధరగా నిర్ణయించారంట. ఇప్పుడు దేవర సినిమాకి కూడా XD వెర్షన్ లో అదే ధరని ఫిక్స్ చేసారంట. ఎక్కువ మంది XD వెర్షన్ లో మూవీని చూడటానికి ఆసక్తి చూపించడంతో టికెట్ లు కూడా భారీగానే బుక్ అయ్యాయంట. ఈ ధరలు ఓవరాల్ కలెక్షన్స్ పెరగడానికి కారణం అయ్యాయని ట్రేడ్ పండితులు అంటున్నారు.
దేవర సినిమా XD వెర్షన్ కి కూడా టికెట్ ధరలు కల్కి తరహాలోనే పెట్టడంతో మొట్టి రోజు ఈ సినిమా మంచి వసూళ్లని అందుకునే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమాకి టికెట్ ధరలు పెంచనున్నారు. దేవర మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ మంచి హిట్ అయ్యాయి. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
మొదటి రోజు నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ సినిమాగా ఆర్ఆర్ఆర్ ఉంది. దీని తర్వాత స్థానంలో బాహుబలి, మూడో స్థానంలో కల్కి 2898ఏడీ సినిమాలు ఉన్నాయి. దేవర మూవీ అయిత 2+ మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ ని నార్త్ అమెరికాలో మొదటి రోజు అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది వేచి చూడాలి.