Begin typing your search above and press return to search.

దేవర ఇంటర్వ్యూ ప్లాన్స్.. బన్నీతో పాటు ఆ ఇద్దరు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ ఎగ్జైటెడ్ ప్రాజెక్ట్ దేవర సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది

By:  Tupaki Desk   |   10 Sep 2024 5:17 AM GMT
దేవర ఇంటర్వ్యూ ప్లాన్స్.. బన్నీతో పాటు ఆ ఇద్దరు
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ ఎగ్జైటెడ్ ప్రాజెక్ట్ దేవర సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమాపై ట్రైలర్ ని సెప్టెంబర్ 10న రిలీజ్ చేయబోతున్నారు. ముంబైలో గ్రాండ్ ఈవెంట్ లో ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నారు. ట్రైలర్ లాంచింగ్ నుంచి దేవర ప్రమోషన్స్ కూడా మొదలు కాబోతున్నాయి. వీలైనంత స్ట్రాంగ్ గా సినిమాని మార్కెట్ లోకి పంపించాలని అనుకుంటున్నారు.

అందుకే కాస్తా డిఫరెంట్ అప్రోచ్ తో ప్రమోషన్స్ చేయబోతున్నారు. ఏకంగా స్టార్స్ ని ఈ చిత్రం కోసం రంగంలోకి దించుతున్నారని తెలుస్తోంది. హిందీలో దేవర టీమ్ ని కరణ్ జోహార్ ఇంటర్వ్యూ చేయనున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగాని కూడా దేవర ఇంటర్వ్యూ కోసం హిందీలో ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు. తాజాగా సందీప్ రెడ్డి వంగా ఎన్టీఆర్ ని ముంబైలో కలిశారు. దీంతో ఈ ప్రచారానికి బలం చేకూరినట్లు అయ్యింది.

ఇక తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ కోసం దేవర ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేయబోతున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య మంది ఫ్రెండ్లీ బాండింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే తారక్ కోసం బన్నీ రాబోతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు రౌడీ బాయ్ సిద్దు జొన్నలగడ్డ కూడా దేవర టీమ్ ని ఇంటర్వ్యూ చేసే సెలబ్రెటీ స్టార్ గా ఉండబోతున్నాడని టాక్. హిందీలో ఇద్దరు, తెలుగు ఇద్దరు స్టార్స్ దేవర టీమ్ ని ఇంటర్వ్యూలు చేయడానికి సిద్ధం అవుతున్నారు.

ఇప్పటికే వీటికి సంబందించిన షెడ్యూల్స్ ఖరారు అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తో పాటు కొరటాల శివ పాల్గొనే అవకాశం ఉంది. హిందీ ఇంటర్వ్యూలలో సైఫ్ అలీఖాన్ పార్టిసిపేట్ చేయనున్నారు. దేవర ట్రైలర్ తోనే సినిమాకి మంచి హైప్ వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. తరువాత ఒక సాంగ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో దేవరపై అంచనాలు భారీగా ఉన్నాయి. కచ్చితంగా ఈ చిత్రానికి మొదటి రోజు 100 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. అదే జరిగితే టాలీవుడ్ నుంచి ప్రభాస్ తర్వాత ఫస్ట్ డే 100 కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా తారక్ నిలుస్తాడు.