Begin typing your search above and press return to search.

దేవర.. అక్కడే బిజీబిజీగా..

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

By:  Tupaki Desk   |   17 Sep 2024 4:27 PM GMT
దేవర.. అక్కడే బిజీబిజీగా..
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. మరో పది రోజుల్లో తన కొత్త మూవీ దేవరతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర పార్ట్-1 రిలీజ్ కు సిద్ధమైపోయింది. కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను అలరించనున్న సినిమాతో టాలీవుడ్ కు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా పరిచయం కానుంది. బీ టౌన్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్.. విలన్ గా కనిపించనున్నారు.

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్సెస్, టీజర్, ట్రైలర్ తో వేరే లెవెల్ లో బజ్ క్రియేట్ చేసిన మేకర్స్.. వరుసగా పోస్టర్లను రిలీజ్ చేస్తే ఫుల్ కిక్ ఎక్కిస్తున్నారు. ఓ రేంజ్ లో హైప్ సృష్టిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన మూడు సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. మ్యూజిక్ లవర్స్ ను తెగ ఆకట్టుకున్నాయి. భారీ వ్యూస్ దక్కించుకుంటున్నాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటున్నాయి

రీసెంట్ గా ఫోర్త్ సింగిల్.. ఆయుధ పూజ సాంగ్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దాంతోపాటు రిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన వర్క్ ను కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే దేవర పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. దీంతో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నార్త్ లో సందడి చేసిన మూవీ టీమ్.. తాజాగా చెన్నైకు చేరుకుంది.

చెన్నైలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రెస్ మీట్ లో తారక్, జాన్వీ, కొరటాల, అనిరుధ్ రవిచందర్ సహా పలువురు పాల్గొన్నారు. సినిమా గురించి కోలీవుడ్ మీడియాకు వివరించారు. అయితే దేవర టీమ్.. మరో రెండు రోజులు చెన్నైలో ఉండనున్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించి మరిన్ని ఇంటర్వ్యూలు ఇవ్వనున్నట్లు.. మీడియాతో చిట్ చాట్స్ లో పాల్గొనున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇప్పటికే ఖరారు అయిపోయింది.

అదే సమయంలో అటు సినీ ప్రియులు.. ఇటు తారక్ అభిమానులు ఎంతో వెయిట్ చేస్తున్న ఆయుధ పూజ సాంగ్ ను కూడా కోలీవుడ్ లోనే దేవర మేకర్స్ రిలీజ్ చేయనున్నట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. రేపు లేదా ఎల్లుండి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి జోరుగా ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొనున్నారని సమాచారం. సెప్టెంబర్ 22వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారని టాక్. మరి చూడాలి ఏం జరుగుతుందో.