Begin typing your search above and press return to search.

ఓటీటీ రిలీజ్… కల్కి రూట్లో దేవర

ఈ మధ్యకాలంలో ఓటీటీ రిలీజ్ అనేది సినిమాలకి చాలా కీలకంగా మారుతోంది.

By:  Tupaki Desk   |   26 Sep 2024 4:09 AM GMT
ఓటీటీ రిలీజ్…  కల్కి రూట్లో దేవర
X

ఈ మధ్యకాలంలో ఓటీటీ రిలీజ్ అనేది సినిమాలకి చాలా కీలకంగా మారుతోంది. స్టార్ హీరోలు పాన్ ఇండియా కథలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అయితే పాన్ ఇండియా రిలీజ్ చేసినపుడు సౌత్ భాషలలో ఓటీటీ రిలీజ్ పరంగా పెద్దగా ఇబ్బందులు లేవు. హిందీలో మాత్రం మల్టీప్లెక్స్ లో సినిమాని ప్రదర్శించాలంటే ఆ థియేటర్స్ అసోసియేషన్ పెట్టిన ఓటీటీ రిలీజ్ కండిషన్స్ ఫాలో అవ్వాల్సిందే. థియేటర్స్ లో రిలీజ్ చేసిన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని నార్త్ ఇండియాలోని మల్టీప్లెక్స్ ఓనర్స్ నిబంధన పెట్టారు.

దీనికి ఒప్పుకుంటేనే మల్టీప్లెక్స్ లలో మూవీని ప్రదర్శిస్తారు. ఈ కండిషన్స్ ప్రకారమే ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ మూవీని 8 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేశారు. మిగిలిన సినిమాలు అన్ని కూడా నాలుగు వారాల గ్యాప్ లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు ఇచ్చే భారీ ఆఫర్స్ కి నిర్మాతలు తలొగ్గి నాలుగు వారాలలోనే ఓటీటీలో సినిమా రిలీజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. మూవీ హిట్ అయిన కూడా థియేటర్స్ లో 4 వారాలకి మించి రన్ ఉండదని మేకర్స్ భావిస్తున్నారు.

అయితే స్టార్ హీరోల నుంచి వచ్చే పెద్ద సినిమాలకి భారీ కలెక్షన్స్ రావాలంటే నార్త్ ఇండియాలో ఎక్కువ వసూళ్లు అందుకోవాలి. అది జరగాలంటే అక్కడ మల్టీప్లెక్స్ లలో కచ్చితంగా రిలీజ్ చేయాలి. అందుకే ‘కల్కి’ సినిమా విషయంలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ పెట్టిన కండిషన్స్ కి మేకర్స్ ఒకే చెప్పారు. ఇప్పుడు ‘దేవర’ ప్రొడ్యూసర్స్ కూడా ‘కల్కి’ మేకర్స్ నిర్ణయాన్ని ఫాలో అవుతున్నారు. 8 వారాల తర్వాతనే సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలనే కండిషన్ కి ఒప్పుకున్నారు.

దీంతో నార్త్ ఇండియాలో పెద్ద ఎత్తున ‘దేవర’ మూవీ రిలీజ్ అవుతోంది. కచ్చితంగా సినిమాకి నార్త్ లో భారీ కలెక్షన్స్ వస్తాయని మేకర్స్ అంచనా వేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తో వచ్చిన ఇమేజ్ ‘దేవర’కి ప్లస్ అవుతుందని నమ్ముతున్నారు. మూవీ రిలీజ్ కి ఇంకా ఒక్క రోజు సమయమే ఉంది. మొదటి రోజు సినిమా టాక్ బట్టి కూడా ఆడియన్స్ రెస్పాన్స్ ఉంటుంది.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్ లో సినిమాకి భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఈ బుకింగ్స్ ద్వారానే 50 కోట్ల షేర్ కలెక్షన్స్ ని ‘దేవర’ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. మూవీకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వస్తే తరువాత కలెక్షన్స్ పుంజుకునే అవకాశం ఉంది. మరి అది ఎంత వరకు సాధ్యమవుతుందనేది వేచి చూడాలి. ఏది ఏమైనా ఎన్టీఆర్ కెరియర్ కి ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కావడంతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నారు.