Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ని టెన్షన్ పెట్టిస్తున్న దేవర..?

అదే ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో వ్యక్తపరిచారు. దేవర సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని చెప్పిన తారక్ రిలీజ్ ముందు కాస్త టెన్షన్ గా ఉందని చెప్పాడు.

By:  Tupaki Desk   |   19 Sep 2024 4:29 PM GMT
ఎన్టీఆర్ ని టెన్షన్ పెట్టిస్తున్న దేవర..?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాన్ ఆఫ్ మాసెస్ గా RRR సినిమాతో ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని కూడా మెప్పించాడు. ట్రిపుల్ ఆర్ సినిమాలో తారక్ చేసిన కొమరం భీం పాత్ర హాలీవుడ్ ఆడియన్స్ ని కూడా అలరించింది. ఐతే ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్ టీ ఆర్ చేస్తున్న సినిమాగా దేవర మీద భారీ అంచనాలు ఉన్నాయి. దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించింది. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను ఈ నెల 27న రిలీజ్ అవుతుంది.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే ఏ సినిమాకు చెప్పని విధంగా ఫ్యాన్స్ కు బూస్ట్ ఇస్తూ దేవర మీద కామెంట్స్ చేస్తున్నాడు. అంతకుముందు ఒక తెలుగు సినిమా ఈవెంట్ కి వచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరవేసేలా దేవర ఉంటుందని చెప్పాడు. ఇక ముంబై ప్రమోషన్స్ లో చివరి అర్ధ గంట నెక్స్ట్ లెవెల్ అని అన్నాడు. తెలుగు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో కూడా లెక్కకు మించి అంచనాలు పెంచేస్తున్నాడు.

ఐతే అన్నీ బాగున్నా కూడా దేవర గురించి ఎన్టీఆర్ కు ఎక్కడో చిన్న టెన్షన్ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. అదే ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో వ్యక్తపరిచారు. దేవర సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని చెప్పిన తారక్ రిలీజ్ ముందు కాస్త టెన్షన్ గా ఉందని చెప్పాడు. ఐతే ఎన్టీఆర్ ఈ సినిమాను ఎంత ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు అన్నది ఆయన పడుతున్న టెన్షన్ చూస్తేనే అర్థమవుతుంది.

రాజమౌళి సినిమా తర్వాత ప్రతి హీరో చేసిన సినిమా ఫ్లాప్ అవుతూ వచ్చింది. ఐతే ఈ బ్యాడ్ సెంటిమెంట్ ని దాటుతుందా ఇక మిగతా కాలిక్యులేషన్స్ అన్ని దేవర అందుకుంటునా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అందుకే దేవర కాన్సెప్ట్ విజువల్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ సాన్స్ ఇవన్నీ ఎంత బాగున్నా సరే రిలీజయ్యే వరకు కాస్త టెన్షన్ తప్పదు. పైగా దేవర ట్రైలర్ పై మిశ్రమ స్పందన రావడం కూడా దీనికి ఒక కారణమని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఎన్టీఆర్ దేవర ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటే మాత్రం ఊహించని రికార్డులను కొల్లగొట్టడం ఖాయమని చెప్పొచ్చు.