Begin typing your search above and press return to search.

దేవర.. సెన్సార్ కట్ ఎక్కడెక్కడ పడింది?

అలాగే కత్తికి డెడ్ బాడీ వేలాడే సీన్ ని తొలగించారంట. దాంతో పాటు ఎన్టీఆర్ సొరచేపపై ప్రయాణించే సీన్ పై సీజీఐ షార్క్ అని డిస్‌క్లైమర్‌ వేయాలని సూచించారంట.

By:  Tupaki Desk   |   13 Sep 2024 4:19 AM GMT
దేవర.. సెన్సార్ కట్ ఎక్కడెక్కడ పడింది?
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర సినిమాతో సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. మూవీ కంటెంట్ ని బలంగా జనాల్లోకి తీసుకెళ్లే పనిలో చిత్ర యూనిట్ ఉంది. ప్రమోషన్స్ కూడా స్పీడ్ అప్ అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ప్రమోషన్స్ చాలా యాక్టివ్ గా చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే నార్త్ లో కరణ్ జోహార్, అలియా భట్ తో కలిసి దేవర ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు.

ఇదిలా ఉంటే దేవర సినిమాకి సెన్సార్ టీమ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమా నిడివి 2 గంటల 58 నిమిషాల వరకు ఉంటుందని తెలుస్తోంది. అంటే సుమారు మూడు గంటలు దేవర సందడి థియేటర్స్ లో ఉండబోతోంది. అలాగే ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు మొత్తం నాలుగు కట్స్ ఇచ్చారంట. సినిమాలో ఓ క్యారెక్టర్ భార్యని, మరో పాత్ర తల్లిని తన్నిన సీన్స్ మార్చాలని సూచించారంట.

అలాగే కత్తికి డెడ్ బాడీ వేలాడే సీన్ ని తొలగించారంట. దాంతో పాటు ఎన్టీఆర్ సొరచేపపై ప్రయాణించే సీన్ పై సీజీఐ షార్క్ అని డిస్‌క్లైమర్‌ వేయాలని సూచించారంట. ఇవి తప్ప సినిమాలో పెద్దగా అభ్యంతరాలు చెప్పలేదని తెలుస్తోంది. అంటే మేగ్జిమమ్ కొరటాల శివ తన ఆలోచనలకి సరిపోయే విధంగా వైలెన్స్ ని మరీ శృతిమించకుండా కథని చూపించినట్లు అర్ధమవుతోంది.

ఓవరాల్ గా సెన్సార్ రిపోర్ట్ పాజిటివ్ గానే ఉందనే మాట వినిపిస్తోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకునేలా ఈ చిత్రాన్ని కొరటాల శివ రెడీ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలలో మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్ కూడా రెండు భిన్నమైన పాత్రలకి పూర్తి స్థాయిలో న్యాయం చేసాడంట. కొన్ని సన్నివేశాలు అయితే గూస్ బాంబ్స్ క్రియేట్ చేయడం పక్కా అని అంటున్నారు. దేవర ట్రైలర్ కి మిక్స్డ్ టాక్ వచ్చిన కూడా ఓవరాల్ గా మాత్రం పాజిటివ్ వైబ్ నడుస్తోంది.

ఈ పాజిటివ్ వైబ్ సినిమాకి మంచి ఓపెనింగ్స్ ని తీసుకొని వస్తాయి. లాంగ్ రన్ కొనసాగాలంటే మౌత్ టాక్ తోనే సాధ్యం అవుతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఎంతో నమ్మకంతో కొరటాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చేశారు. మరి ఆయన నమ్మకాన్ని కొరటాల శివ ఎంత వరకు నిలబెట్టాడో తెలియాలంటే రిలీజ్ డేట్ వరకు వెయిట్ చేయాల్సిందే.