Begin typing your search above and press return to search.

తారక్ స్టెప్పులకు జపాన్ ఫ్యాన్స్ లో హై వోల్టేజ్ జోష్

ముఖ్యంగా దేవర విజువల్స్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By:  Tupaki Desk   |   24 March 2025 6:33 PM IST
Devara hype in Japan
X

కోరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే సోలోగా వచ్చిన బెస్ట్ టాప్ సినిమా ఇదే. బాక్సాఫీస్ పరంగా మంచి బూస్ట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు జపాన్ లో దేవర హడావుడి స్టార్ట్ అయ్యింది. అక్కడ సినిమాను ఇప్పుడు గ్రాండ్ గా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జపాన్ లో విడుదలైన పోస్టర్లు, టీజర్ ఆడియన్స్‌లోనూ మంచి క్రేజ్ తెచ్చేశాయి. ముఖ్యంగా దేవర విజువల్స్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవల ‘దేవర’ మూవీ టీమ్ జపాన్ కు వెళ్లింది. అక్కడ స్పెషల్ ప్రీమియర్ షో ఏర్పాటు చేయడం, జపనీస్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ప్రమోషన్స్ నిర్వహించడం చూస్తేనే సినిమాపై ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతోంది. ఫ్యాన్స్ రెస్పాన్స్ కు తాము కూడా షాక్ అయ్యామని యూనిట్ సభ్యులే అంటున్నారు. ఈ సందర్బంగా జరిగిన ప్రీమియర్ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్వయంగా హాజరై ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశాడు.

అంతేకాకుండా, జపాన్ ఫ్యాన్స్‌తో కలిసి ‘ఆయుధ పూజ’ సాంగ్ కు ఎన్టీఆర్ స్టెప్పులు వేయడం హైలైట్‌గా మారింది. థియేటర్ నిండా ఫ్యాన్స్ చప్పట్లు, హర్షధ్వానాలతో మోగిపోయింది. అభిమానులంతా ఎన్టీఆర్ స్టెప్పులకు జత కలుస్తూ వీడియోలు తీస్తూ సెల్ఫీలు తీసుకోవడంతో ఆ సమయం పూర్తిగా ఫ్యాన్ ఫెస్టివల్ లా మారిపోయింది. ఎన్టీఆర్ ఎనర్జీ, ఆయన స్టైల్ అక్కడి జపనీస్ ఆడియన్స్‌ను కూడా పూర్తిగా ఆకట్టుకుంది.

ఈ ప్రీమియర్ ఈవెంట్ ద్వారా దేవర సినిమాకు ఆ దేశంలో ఉన్న క్రేజ్ మరోసారి రుజువైంది. ఇప్పటికే జపాన్ మార్కెట్లో భీమ్ పాత్రతో ఎన్టీఆర్‌కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా తర్వాత ఆయనకు అక్కడ విపరీతమైన అభిమాన వర్గం ఏర్పడింది. ఇప్పుడు ‘దేవర’తో ఆ పాపులారిటీని మరింత పెంచే ప్రయత్నం జరుగుతోంది.

దేవరలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రథనవేలు సినిమాటోగ్రఫీ అందించారు. మొత్తం మీద జపాన్ ప్రీమియర్ ఈవెంట్ మరోసారి దేవర సినిమా హైప్‌ను ఇంటర్నేషనల్ లెవెల్ లో పెంచేసిందన్నది మాత్రం ఫిక్స్. ఇక దేవర 2 షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2తో బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.