Begin typing your search above and press return to search.

బాలీవుడ్ షోకు తారక్.. ఓ రేంజ్ లో ఫన్ పక్కా!

ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ సందడి చేశారు. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   14 Sep 2024 9:17 AM GMT
బాలీవుడ్ షోకు తారక్.. ఓ రేంజ్ లో ఫన్ పక్కా!
X

'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' గురించి అందరికీ తెలిసిందే. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన ఆ షో.. రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. వేరే లెవెల్ లో సక్సెస్ అందుకుంది. ఓటీటీ లవర్స్ ను ఓ రేంజ్ లో మెప్పించింది. ఇప్పటికీ ముగిసిన ఫస్ట్ సీజన్ కు అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, దిల్జిత్ దోసాంజ్, సన్నీ డియోల్, బాబీ డియోల్, మేరీ కోమ్, సైనా నెహ్వాల్, సానియా మీర్జా సహా ఎందరో సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చారు.

ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ సందడి చేశారు. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. అయితే హోస్ట్ కపిల్ శర్మ తాజాగా సెకండ్ సీజన్ ను ప్రకటించారు. ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు. సెప్టెంబరు 21వ తేదీ షో కొత్త ఎపిసోడ్‌ నెట్ ఫ్లిక్స్ లో రాత్రి 8 గంటలకు స్ట్రీమింగ్ అవుతుందని చెప్పారు. అదే సమయంలో సీజన్-2 ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ వస్తోంది.

సీజన్ 1కు మించి సీజన్ 2 మరింత నవ్వులు, వినోదాన్ని అందిస్తుందని క్లారిటీ వచ్చేసింది. అదే సమయంలో ట్రైలర్ లో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. దేవర ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ జాన్వీ కపూర్, నటుడు సైఫ్ అలీ ఖాన్, నిర్మాత కరణ్ జోహార్ తో తారక్ వెళ్లారు. అయితే సీజన్-2 ఎపిసోడ్ లో వారంతా ఫుల్ సందడి చేసినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఓ రేంజ్ లో అలరించనున్నట్లు కనిపిస్తోంది.

ముఖ్యంగా నలుగురి మధ్య కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంది. సైఫ్ సైగలకు తారక్ ఫుల్ గా నవ్వుతూ కనిపించారు. వారిద్దరి మధ్య జరిగిన గేమ్స్ కామెడీగా ఉన్నాయి. జాన్వీ కూడా తన ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో అలరించింది. అయితే తారక్.. స్టైలిష్ గా సందడి చేశారు. క్రీమ్ కలర్ జాకెట్ అండ్ టీ షర్ట్ తో షోకు వచ్చారు. సైఫ్ అలీ ఖాన్.. ఫార్మల్ సూట్ లో అటెండ్ అయ్యారు. ఇక జాన్వీ.. ముత్యాలు పొదిగిన అదిరిపోయే డ్రెస్ లో తళుక్కుమంది.

అయితే దేవర టీమ్ అటెండ్ అయిన ఎపిసోడే.. సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ గా స్ట్రీమింగ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సెప్టెంబర్ 27వ తేదీన దేవర రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 21న ఫస్ట్ ఎపిసోడ్ అందుబాటులోకి రానుంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా.. తొలి ఎపిసోడ్ దేవర్ టీమ్ దే ఉంటుందని అంతా అంచనా వేస్తున్నారు. ట్రైలర్ బట్టి.. దేవర టీమ్ ఉన్న ఎపిసోడ్ ఫుల్ ఫన్నీగా ఉండనున్నట్లు క్లియర్ తెలుస్తోంది.