Begin typing your search above and press return to search.

దేవర ఓపెనింగ్స్.. ఇది బిగ్ బూస్టప్

అయితే రిలీజ్ కు ముందే ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోంది దేవర. మరెన్నో రికార్డులను తిరగరాస్తోంది.

By:  Tupaki Desk   |   17 Sep 2024 8:21 AM GMT
దేవర ఓపెనింగ్స్.. ఇది బిగ్ బూస్టప్
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర పార్ట్-1.. మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్.. మంచి హిట్ గా నిలిచింది. ఇప్పుడు దేవరపై వరల్డ్ వైడ్ గా అటు సినీ ప్రియుల్లో.. ఇటు తారక్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.

అయితే రిలీజ్ కు ముందే ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోంది దేవర. మరెన్నో రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వగా.. మిలియన్స్ లో టికెట్స్ సేల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు జరగని రీతిలో ప్రీ సేల్స్ అవుతున్నాయి. దీంతో విడుదలకు ముందే ప్రీ బుకింగ్స్ ద్వారా కోట్ల రూపాయలను ఆర్జిస్తోంది దేవర. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సినీ ప్రియులు.. కూడా అడ్వాన్స్ బుకింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.

అదే సమయంలో తెలంగాణ వ్యాప్తంగా ఆరు షోలు వేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని 15కి పైగా స్క్రీన్లలో అర్థరాత్రి ఒంటి గంట షోలు పడనున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అవన్నీ సింగిల్ స్క్రీన్లేనని చెప్పాయి. మిగతా సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌ లలో ఉదయం 4 గంటలకు షోలు వేయనున్నారని పేర్కొన్నాయి. దీంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో దేవర ఓపెనింగ్స్ సాధించేందుకు ఒంటి గంట షోలు.. పెద్ద బూస్టప్ గా మారుతాయని ట్రేడ్ పండితులు ఇప్పుడు చెబుతున్నారు. సినిమాపై అంచనాలు భారీగా ఉండడం.. మేకర్స్ వేరే లెవల్ లో ప్రమోషన్స్ చేస్తుండడం.. మిడ్ నైట్ షోలకు సూపర్ రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు. అదే సమయంలో ఫ్యాన్స్.. ఈగర్లీ వెయిటింగ్ అని కామెంట్లు పెడుతున్నారు. రచ్చ రచ్చ పక్కా అని చెబుతున్నారు.

కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర పార్ట్-1 జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు. అజయ్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. మరి సెప్టెంబర్ 27వ తేదీ రిలీజ్ కానున్న దేవర మూవీ ఎలా ఉంటుందో చూడాలి.