దేవర.. తెలుగు రాష్ట్రాల్లో ఆఫ్ సెంచరీ కొడుతుందా?
ఇక తెలుగు రాష్ట్రాలలో 'దేవర' మొదటి రోజు కలెక్షన్స్ పై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఈ మూవీ 50 కోట్ల క్లబ్ లో చేరుతుందా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది.
By: Tupaki Desk | 16 Sep 2024 3:48 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రెడీ అయిన 'దేవర' మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులు ముందుకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని చూసేందుకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ నుంచి సోలో రిలీజ్ వచ్చి సుమారు ఆరేళ్లు అవుతుంది. దీంతో నందమూరి అభిమానులు ఈ సినిమాపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే 'దేవర' బెస్ట్ మూవీగా నిలుస్తుందని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 'దేవర' సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న హైప్ నేపథ్యంలో ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని భావిస్తున్నారు. అదే జరిగితే కచ్చితంగా ఒక రికార్డు క్రియేట్ అయినట్లే అవుతుంది.
ఇక తెలుగు రాష్ట్రాలలో 'దేవర' మొదటి రోజు కలెక్షన్స్ పై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఈ మూవీ 50 కోట్ల క్లబ్ లో చేరుతుందా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా 'ఆర్ఆర్ఆర్' మొదటి స్థానంలో ఉంది. ఈ సినిమా ఫస్ట్ డే 73.97 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో వసూళ్లు చేసింది. దీని తర్వాత డార్లింగ్ ప్రభాస్ 'సలార్' 47.60 కోట్లతో కలెక్షన్స్ తో రెండో స్థానంలో ఉంది.
ఈ ఏడాది రిలీజ్ అయిన ప్రభాస్ 'కల్కి 2898ఏడీ' చిత్రం 44.39 కోట్ల కలెక్షన్స్ మొదటి రోజు సాధించి మూడో స్థానంలోకి వచ్చింది. 'బాహుబలి 2' ఫస్ట్ డే 43 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని నాలుగో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క 'ఆర్ఆర్ఆర్' తప్ప ఏ చిత్రం ఫస్ట్ డే 50 కోట్ల కలెక్షన్స్ సాధించలేదు. ఇప్పుడు 'దేవర' 50 కోట్ల క్లబ్ లో చేరితే మాత్రం కచ్చితంగా అది సెన్సేషన్ అవుతుంది. టాప్ 2 హైయెస్ట్ గ్రాస్ చిత్రంగా నిలుస్తుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇమేజ్, కొరటాల శివ కంటెంట్, జాన్వీ కపూర్ గ్లామర్, అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ ఈ సినిమాలో అట్రాక్టివ్ ఫ్యాక్టర్స్ గా ఉన్నాయి. ఇవన్నీ కచ్చితంగా దేవర సినిమాకి భారీ కలెక్షన్స్ రావడంలో కీలకంగా మారుతాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి అది అంతవరకు సాధ్యమవుతుంది అనేది వేచి చూడాలి.