Begin typing your search above and press return to search.

దేవ‌ర: మూడో పాటతో మూడ్ పుట్టిస్తాడు

ప్ర‌ఖ్యాత గ‌ణాంకాల సంస్థ నుంచి ఈ ప్ర‌క‌ట‌న ఎన్టీఆర్- కొర‌టాల అసాధార‌ణ‌ ప్ర‌య‌త్నంపై మ‌రింత ఆస‌క్తిని పెంచింది.

By:  Tupaki Desk   |   2 Sep 2024 3:38 PM GMT
దేవ‌ర: మూడో పాటతో మూడ్ పుట్టిస్తాడు
X

ఈ సీజ‌న్ లో మోస్ట్ అవెటెడ్ రిలీజ్ `దేవ‌ర-1` అని ఐఎండిబి ప్ర‌క‌టించింది. ప్ర‌ఖ్యాత గ‌ణాంకాల సంస్థ నుంచి ఈ ప్ర‌క‌ట‌న ఎన్టీఆర్- కొర‌టాల అసాధార‌ణ‌ ప్ర‌య‌త్నంపై మ‌రింత ఆస‌క్తిని పెంచింది. పాన్ ఇండియా కేట‌గిరీలో వ‌స్తున్న దేవ‌ర క‌థాంశం న‌భూతోన‌భ‌విష్య‌తి అని న‌మ్మ‌కంగా చెబుతున్నారు. మేకింగ్ స్టాండార్డ్స్ హాలీవుడ్ రేంజుకు త‌గ్గ‌ద‌ని అంద‌రి న‌మ్మ‌కం. ఈ మూవీ నుంచి ఒక్కో పాట ఇప్ప‌టికే బోలెడంత ఉత్సాహం పెంచాయి. ప్రతి పాట ఒక్కో స్టైల్ తో యువ‌త‌రం హృద‌యాల‌ను గెలుచుకున్నాయి.

ఇప్ప‌టికే విడుద‌లైన `చుట్ట‌మ‌ల్లే...` పాట‌లో తార‌క్- జాన్వీ రొమాన్స్, స్టైలిష్ డ్యాన్సులు మైమ‌రిపించాయి. ఫియర్ సాంగ్ అంతే ఉత్సాహం నింపింది. ఇవి రెండూ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి మూడో సింగిల్ `దావుడి`ని రిలీజ్ చేయ‌నున్నారు. దేవర మేకర్స్ ఈ సాయంత్రం సోషల్ మీడియాలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. దావూడి సాంగ్ వీడియో సెప్టెంబర్ 4న విడుదల కానుందని ప్రకటించారు. పాటల షూట్ నుండి ఎన్టీఆర్ - జాన్వీ జోడీ కూల్ పోస్టర్ కూడా ఆవిష్కరించారు. ``ఇర్రెసిస్టిబుల్ డ్యాన్స్ బ్లేజ్ కోసం బీట్స్ సెట్ చేసాం. దావుడి పాట అందరినీ డ్యాన్సాడిస్తుంది`` అని టీజ్ చేసారు. దావుడి రొమాంటిక్ డ్యాన్స్ నంబర్‌.. డ్యాన్సుల్లోను అద‌ర‌గొట్టే ఛాన్సుంద‌ని తెలుస్తోంది.

దేవర లో ఆదిపురుష్ ఫేం సైఫ్ అలీ ఖాన్ నెగిటివ్ రోల్‌లో నటిస్తున్నాడు. శివ కొరటాల దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప‌లు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌గా విడుదల కానుంది. దేవ‌ర పార్ట్ 1 విజ‌యం పార్ట్ 2 ని నిర్ధేశిస్తుంద‌ని అంచ‌నా. ప్ర‌స్తుతం ఫ్యాన్స్ ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు.