Begin typing your search above and press return to search.

దేవర దావుదీ.. రెస్పాన్స్ ఎలా ఉందంటే..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ దేవర సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది.

By:  Tupaki Desk   |   5 Sep 2024 6:00 AM GMT
దేవర దావుదీ.. రెస్పాన్స్ ఎలా ఉందంటే..
X

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ దేవర సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే రెండు సాంగ్స్ గట్టిగానే ట్రెండ్ అయ్యాయి. ఫస్ట్ సింగిల్ గా దేవర ఎలివేషన్ సాంగ్ గా వచ్చింది. దీనికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ సింగిల్ హీరోయిన్ పాయింట్ అఫ్ వ్యూలో రొమాంటిక్ మెలోడీగా రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది.

ఈ సాంగ్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. చుట్టమల్లే అంటూ సాగే ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ని శ్రీలంక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ 'మానికే మగే హైతే' నుంచి కాపీ కొట్టాడనే విమర్శలు వచ్చాయి. యాంటీ ఫ్యాన్స్ అయితే ఈ సాంగ్ విషయంలో దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఈ ట్రోలింగ్ ని తట్టుకొని చుట్టమల్లే సాంగ్ సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే దేవర నుంచి మూడో సింగిల్ గా 'దావుదీ' అనే వీడియో సాంగ్ వచ్చింది.

ఈ సాంగ్ కి ఎన్టీఆర్ అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సాంగ్ లో ఎన్టీఆర్ సూపర్ గా డాన్స్ చేసాడనే మాట వినిపిస్తోంది. ఎన్టీఆర్ తో పోటీపడి డాన్స్ చేసే హీరోయిన్స్ టాలీవుడ్ లో పెద్దగా లేరని చెప్పొచ్చు. గతంలో తమన్నా కొంతవరకు డాన్స్ లో ఎన్టీఆర్ ని మ్యాచ్ చేసింది. అయితే చాలా మంది హీరోయిన్స్ మాత్రం ఎన్టీఆర్ తో చేసిన సాంగ్స్ లో చిన్న చిన్న డాన్స్ మూమెంట్స్ మాత్రమే పరిమితం అయ్యేవారు. అయితే దావుదీ సాంగ్ లో జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో పోటీ పడి డాన్స్ చేసి అలరించింది.

తన అందంతో పాటు డాన్స్ మూమెంట్స్, ఎక్స్ ప్రెషన్స్ తో సాంగ్ కి అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది. దీంతో ఈ పాటకి యుట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ పాటని కూడా అనిరుద్ కాపీ చేసాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్ ఈ సాంగ్ విషయంలో అనిరుద్ ని ట్రోల్ చేస్తున్నారు. జైలర్ సినిమాలోని కావాలయ్య సాంగ్ ట్యూన్ ని కొద్దిగా మార్చేసి దావుదీ పాటని అనిరుద్ కంపోజ్ చేసాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మెజారిటీ ప్రేక్షకులు సాంగ్ ని ఆస్వాదిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ యాంటీ ఫాన్స్, అనిరుద్ మ్యూజిక్ ని ఇష్టపడని వారు మాత్రం ఇక సాంగ్ ట్యూన్ పైన ఎక్కువగా ట్రోలింగ్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. అనిరుద్ గతంలో ఏ మూవీ సాంగ్స్ విషయంలో ఇంత దారుణమైన ట్రోలింగ్ పేస్ చేయలేదు. మొదటిసారిగా దేవరకి మాత్రం కాపీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై అతను ఏమైనా వివరణ ఇస్తాడా లేదా అనేది వేచి చూడాలి. ఏదేమైనా మూడు పాటలు కమర్షియల్ యాంగిల్ లో మంచి బూస్ట్ అయితే ఇచ్చాయి. ఇక దేవర కంటెంట్ పరంగా ఎలా ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి.